టీడీపీలో తమ్ముళ్ల కుమ్ములాట | Sakshi
Sakshi News home page

టీడీపీలో తమ్ముళ్ల కుమ్ములాట

Published Tue, Jan 23 2024 4:54 PM

TDP Leaders Internal Clashes Parvathipuram District Over Flexis - Sakshi

సాక్షి, పార్వతిపురం మన్యం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా సాలూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటకు దిగారు. ఫ్లెక్సీలు చించుకోవటంతో టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సాలూరు టౌన్‌లో సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం ఇందుకు వేదికైంది. స్థానిక శంబర జాతరకు సందర్భంగా టీడీపీ నేత తేజోవతి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అయితే వాటిని తెలుగుదేశంలోని కొందరు నేతలు చించేయడంతోపాటు మరోనేత సంధ్యారాణి ఫ్లెక్సీలు అతికించారు. దీంతో మామిడిపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రజలు ఆ ఫ్లెక్సీలను చూసి టీడీపీ రోజురోజుకు దిగజారిపోయిందని అనుకుంటున్నారు. టీడీపీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఫోటోలను ఒకరి వర్గం ఒకరు చించుకున్నారు. వాటి స్థానంలో తమ నాయకురాలు ఫొటో పెట్టిన నేపథ్యంలో టీడీపీలో వర్గ విభేదాలపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. దీనిపై స్థానికంగా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. 

చదవండి: AP: ESMSపై కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం

Advertisement
 
Advertisement
 
Advertisement