మునుగోడుపై ప్లాన్‌ మార్చిన కాంగ్రెస్‌.. ప్రియాంక కీలక ఆదేశాలు 

Priyanka Gandhi Special Focus On Munugode Assembly Constituency  - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ అంతా మునుగోడుపైనే ఉంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు సైతం మునుగోడుపై నజర్‌ పెట్టాయి. కాగా, కాంగ్రెస్‌ మాత్రం మునుగోడులో కచ్చితంగా తమ పార్టీ జెండాను ఎగురవేయాలని ప్లాన్స్‌ రచిస్తోంది. 

ఇక, మునుగోడుపై గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మునుగోడు బరిలోకి ప్రియాంక గాంధీ రంగ ప్రవేశం చేశారు. ప్రియాంక ఉప ఎన్నికలపై ఫోకస్‌ పెట్టారు. టీ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించింది. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ, వేణుగోపాల్‌, మాణిక్యం ఠాగూర్‌ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికపై అధిష్టానం వ్యూహరచన చేయనుంది. 

మరోవైపు.. మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర​్‌ఎస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ప్రజాదీవెన సభతో శనివారం బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సభలో సీఎం కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ‍క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీ తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: మునుగోడులో బీజేపీ సభకు కేంద్రమంత్రి అమిత్‌షా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top