చంద్రబాబూ.. డబ్బా కొట్టడం ఆపు: కాకాణి | Kakani Govardhan Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. డబ్బా కొట్టడం ఆపు: కాకాణి

Apr 26 2026 12:12 PM | Updated on Apr 26 2026 1:14 PM

Kakani Govardhan Reddy Fires On Chandrababu

సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వానికి అన్నదాతలను ఆదుకోవాలన్న విచక్షణ లేదంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంటకు గిట్టుబాటు ధర లేదని.. దళారీల బారిన పడి నష్టపోతున్న రైతులు.. ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. చంద్రబాబు తాను ఏదో బిజినెస్ రీఫార్మర్‌ అంటూ డబ్బా కొట్టుకోవడం తప్ప మరేమిలేదు’’ అంటూ  కాకాణి ధ్వజమెత్తారు.

‘‘మొంథా తుపాను నష్టపరిహారం నేటికి దిక్కు లేదు. రెండేళ్లలో లక్షల మంది రైతులు కనీస ధర లేక తీవ్ర నష్టాన్ని చవిచూశారు. కేంద్రానికి లేఖ రాసి, ముసలి కన్నీరు కారుస్తున్నాడు. రైతాంగ పరిస్థితి పక్కన పెట్టి అమరావతి బాకా ఊదుతున్నారు. పొగాకు, మిర్చి, పత్తి ఇలా అన్ని రకాల రైతులు నష్టపోయారు. మొక్కజొన్న వేసి లాభం పొందండి అని ప్రభుత్వం దండోరా వేసింది. నేడు మొక్కజొన్న వేసిన రైతులకు పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. కూరగాయలు, టమోటా రైతుల పరిస్థితి సైతం దీనస్థితిలో వున్నారు

..బతుకు తెరువు కోసం వ్యవసాయాన్ని వదిలి కూలీ పని చేసుకునే దుస్థితి ఏర్పడింది. వరి పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు లేవు. గోతాలు లేవు. కేవలం మాటలు చెప్పి మోసం చేశారు. రైతులు వ్యవసాయం మానేస్తే మేలు.. వ్యవసాయం అంటే దండగా అనే వ్యక్తి చంద్రబాబు. అదే వైఎస్‌ జగన్ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధరపై పూర్తి అధ్యయనం జరిపి ఆదుకునేవాళ్లం. ప్రతి ఏడాది 3 వేల కోట్ల నిధులు రైతాంగానికి కేటాయించిన చరిత్ర జగన్‌ది. నేడు కనీసం ఉచిత పంట బీమా చేసిన పాపాన పోలేదుజ. వైఎస్‌ జగన్ హయాంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా ఆదుకోవడం జరిగింది. సున్నా వడ్డి రుణాల సంగతే రైతులు మరిచిపోవాలసిన పరిస్థితి నేడు ఏర్పడింది’’ అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement