రాహుల్‌.. నువ్వు లేకుండా ఎలా?

BJP Leaders Taunt On Rahul Gandhis Martial Arts Video - Sakshi

ముంబై: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ప్రజాదరణను చూరగొని కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తేవాలనే ఏకైక లక్ష్యంతో చేపట్టిందే భారత్‌ జోడోయాత్ర. కాగా, రాహుల్‌ తన జోడోయాత్రలో భాగంగా షేర్‌ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

గతవారం మహారాష్ట్రలో భారత్‌ జోడోయాత్ర చేపట్టిన క్రమంలో రాహుల్‌ అండ్‌ పార్టీ చిట్‌చాట్‌లో పాల్గొన్న సందర్భంలో ఒక వీడియో చేసింది. అది కూడా బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లను ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే చేసింది.  అందులో మార్షల్‌ ఆర్ట్స్‌ను జోడించాడు రాహుల్‌. ఒక వ్యక్తిపైకి ఎవరైనా సమూహంగా వచ్చి దాడి చేస్తే దాన్ని ఎలా అడ్డుకట్టవేయాలో రాహుల్‌ తన మార్షల్‌ ఆర్ట్స్‌ టెక్నిక్‌తో చూపించాడు. ప్రత్యక్ష యుద్ధంలోనే కాదు.. పరోక్ష యుద్ధంలో కూడా ఒక వ్యక్తి తన శక్తిని ఎలా కూడగట్టుకోవాలో రాహుల్‌ ఆ వీడియోలో చూపించాడు.

ఇందులో ఒక నాయుకుడు మోకాళ్లపై కూర్చొని ఉండగా, కొంతమంది నాయకులు సమూహం వచ్చి వరుసగా నిల్చొని అతన్ని నెట్టే యత్నం చేస్తారు. అక్కడ సమూహంగా వచ్చిన వారికి, సింగిల్‌ ఉన్న వ్యక్తికి ఉన్న పోటీ పెట్టాడు రాహుల్‌. కానీ మోకాళ్లపై కూర్చొన్న వ్యక్తి వాళ్లను నిలువరిస్తాడు.  దీన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడమే కాకుండా బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల నుంచి వచ్చే ఎదురుదాడులను ఇలానే ఎదుర్కోవాలని చెప్పే యత్నం చేశాడు. ఇదే తన యూట్యూబ్‌ చానల్‌లో షేర్‌ చేశాడు రాహుల్‌. 

దీనిపై ఇప్పుడు సెటైరికల్‌ కామెంట్స్‌ చేస్తున్నారు బీజేపీ నేతలు.  ఈ వీడియోను షేర్‌ చేస్తూ రాహుల్‌పై జోక్‌లు వేస్తున్నారు. ‘ హే రాహుల్‌.. నువ్వు టెక్నిక్స్‌ చెప్పావ్‌ కానీ నువ్వు ప్రత్యక్షంగా పాల్గొనలేదే. నువ్వు లేకుండా మేము ఏం చెయ్యాలి’ అని బీజేపీ నేత అమిత్‌ మాలవియా ఆ వీడియోను షేర్‌ చేశాడు. ఈ వీడియోను మిగతా బీజేపీ నేతలు కూడా షేర్‌ చేస్తూ జోక్‌లు వేస్తున్నారు.

జపాన్‌ మార్షల్‌ ఆర్ట్‌ ఆకిడోలో బ్లాక్‌ బెల్ట్‌ పొందిన రాహుల్‌.. తన జోడోయాత్రలో ఆ టెక్నిక్స్‌ను సమయం వచ్చినప్పుడుల్లా  వినియోగించడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top