ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?
న్యూస్‌రీల్
23న ప్రారంభం కానున్న పబ్లిక్ పరీక్షలు గుంటూరు జిల్లాలో 87 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 68,941 మంది విద్యార్థులు ఇన్విజిలేటర్లుగా 1,478 మంది అవసరం పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి రప్పించేలా అధికారుల ఏర్పాట్లు
ఇతర జిల్లాల వారిని నియమిస్తాం
ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణలో చీఫ్, డీవోలతోపాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లుగా నియమించేందుకు అధ్యాపకుల కొరత ఉంది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులను పంపాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. ప్రైవేటు కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో చీఫ్, డీవోలు, ఇన్విజిలేటర్ల నియామకంలో ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
– జి.సునీత, ఆర్‌ఐవో, గుంటూరు
పల్నాడు
సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో కీలకమైన ఇన్విజిలేషన్ విధులకు గుంటూరు జిల్లాలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు జరుగుతున్న ప్రాక్టికల్స్ ఈ నెల 10వ తేదీన ముగియనున్నాయి. థియరీ పరీక్షలపై దృష్టి సారించిన అధికారులకు ఇన్విజిలేటర్ల కొరత ఇబ్బందికరంగా మారింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 36.1837 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 539.40 అడుగులకు చేరింది. సాగర్ నుంచి కుడి కాలువకు 9,500 క్యూసెక్కులు వదులుతున్నారు.
జిల్లాలోనే అధికం
ప్రైవేటు అధ్యాపకులకు బాధ్యతలు
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు
పర్చూరు (చినగంజాం): పర్చూరు కోర్టు భవన నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అన్నారు. పర్చూరులోని కోర్టు భవనం శిథిలావస్థకు చేరడంతో అద్దె భవనంలోకి కోర్టును మారుస్తున్న క్రమంలో ఆదివారం అద్దె భవనాల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు పర్చూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.జాన్‌బాబు అధ్యక్షత వహించారు. హైకోర్టు జడ్జిలు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వై.లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. కోర్టు పాత భవనం శిథిలావస్థకు చేరినందున దాని స్థానంలో కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు అద్దె భవనంలో కోర్టు కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. కొత్త భవన నిర్మాణంలో ఎటువంటి నాణ్యత లోపాలు లేకుండా కోర్టు నిర్వహణ అవసరాలను గుర్తించి ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత విభాగాలకు సూచించారు. కోర్టు భవనాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తులు జస్టిస్ టి.సునీల్ చౌదరి, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, ప్రకాశం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి టి.రాజ్యలక్ష్మి, జిల్లా సెషన్స్ రిటైర్డ్ జడ్జి ఎ. భారతి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు సర్కార్ తీరుతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ఈ–క్రాప్ నమోదు నత్తనడకను తలపిస్తోంది. పంటల విస్తీర్ణంలో ఇప్పటికి సగం మాత్రమే నమోదు చేశారు. వ్యవసాయ విధులు నిర్వర్తించాల్సిన సిబ్బందికి సర్వేల పేరుతో పనిభారం పెంచడంతో ఈ–క్రాప్ నమోదు నీరసంగా సాగుతోంది. గడువులోగా పూర్తి స్థాయిలో నమోదుకు అవకాశం కనిపించటం లేదు. ఫలితంగా రైతులు నష్టపోయే ప్రమాదముంది.
నత్తనడకన ‘ఈ–క్రాప్’
7
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు
ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?
ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?
ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?
ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?
ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?
ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?
ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?
ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?
ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?


