ఘనంగా భక్తాంజనేయ ఆలయ వార్షికోత్సవం
సత్తెనపల్లి: పట్టణంలోని మహారాష్ట్ర వీధిలో భక్తాంజనేయ స్వామి ఆలయ 26వ వార్షికోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి పంచామృత అభిషేకాలు, హోమం, విశేష అలంకార కార్యక్రమాలు నిర్వహించారు. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి వేదాంతం విజయనరసింహాచార్యులు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పిరోజి, కొత్త రామకృష్ణ, కిషోర్, బాజీ నాయన, పవన్, రాజేశ్వరి, వసుంధర, సుకన్య, ఉష, వెంకటేశ్వర్లు, శివాజీ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పంచముఖ గాయత్రీ ద్వాదశ
జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం వార్షికోత్సవం
తెనాలి టౌన్: కొలకలూరు సమీపంలోని పంచముఖ గాయత్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 10వ వార్షిక ప్రతిష్టా మహోత్సవాలు రెండురోజులపాటు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. విశ్వగాయత్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, శాశ్వత అధ్యక్షులు నంబూరు వెంకట కృష్ణమూర్తి నిర్వహణలో ఈ వేడుకలు నిర్వహించారు. వ్యవస్థాపక ధర్మకర్త నాగం నాగేంద్రరావు, సావిత్రి దంపతులు శాంతి హోమం జరిపించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని భక్తులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. ట్రస్ట్ కార్యదర్శి యర్రంశెట్టి హనుమంతరావు, కోశాధికారి వెలివెల రమేష్‌బాబు, సభ్యులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.
ఉత్సవాల ఏర్పాట్లను
పరిశీలించిన కలెక్టర్
యడ్లపాడు: కొండవీడుకోట ఫెస్ట్ –2026 ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కొండవీడుకోటను సందర్శించారు. కొండకింద, వేదిక, ఫుడ్‌కోర్టులు, వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే స్టాళ్లు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే పోలీస్‌శాఖ నుంచి జిల్లా ఎస్పీ కృష్ణారావు పర్యవేక్షణలో డీఎస్సీ హనుమంతరావు, ముగ్గురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 180 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ తెలిపారు.
జిల్లా కోర్టు పబ్లిక్
ప్రాసిక్యూటర్‌గా చుక్కపల్లి
గుంటూరు లీగల్: గుంటూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా చుక్కపల్లి రమేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఘనంగా శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆలయ వార్షికోత్సవం
చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): చాగంటివారిపాలెం గ్రామంలోని శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. స్వామికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా భక్తాంజనేయ ఆలయ వార్షికోత్సవం
ఘనంగా భక్తాంజనేయ ఆలయ వార్షికోత్సవం
ఘనంగా భక్తాంజనేయ ఆలయ వార్షికోత్సవం


