అభిషేక సేవలు నిలిపివేత
త్రికోటేశ్వరస్వామి ఆలయంలోవారం రోజులుగా నిలిచిన సేవలు మహాశివరాత్రి వరకు నిలిపివేస్తున్నట్టు అధికారుల ప్రకటన అశోచం రావడంతో ఆలయానికి దూరంగా ఎనిమిది మంది అర్చకులు పని ఒత్తిడితో సేవలకు దూరంగా ముగ్గురు అర్చకులు అర్చకుల వివాదంతో మూలవిరాట్ అభిషేకాలు నిలిపివేసినట్టు ప్రచారం
భక్తుల రద్దీతోనే అభిషేకాలు నిలిపివేత
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి అభిషేక సేవలు వారం రోజులుగా నిలిచిపోయాయి. గతంలో ఎన్నూడూ లేని విధంగా స్వామి వారి మూలవిరాట్ అభిషేకాలను ఈ ఏడాది పది రోజుల ముందుగానే నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆలయ అర్చకుల్లో అధికంగా ఉన్న కుటుంబాలకు అశోచం రావడం, మిగిలిన అర్చకులు పని భారంతో స్వామి వారి కై ంకర్యాలను నిర్వహించలేమని చెప్పడంతో మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేశారు. దీంతో ఆలయంలో అర్చకుల మధ్య వివాదం మరోసారి వెలుగు చూసింది. మరో పది రోజుల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండలో తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో స్వామి వారికి అభిషేకాలు నిలిపివేయడంపై భక్తుల నుంచి విమర్శలు వినవస్తున్నాయి.
పోస్టుల భర్తీలో అన్యాయం
త్రికోటేశ్వరస్వామి వారికి వందల సంవత్సరాలుగా కొండకావూరి వంశస్తులు వంశపారంపర్యంగా అర్చకత్వం నిర్వహిస్తున్నారు. స్వామి వారి కై ంకర్యాల కోసం కొండకావూరి వంశస్తులు రెండు తెగులుగా విడిపోయారు. ప్రథమ భాగంలో 10, ద్వితీయ భాగంలో తొమ్మిది మంది ఉన్నారు. అశోచ సమయాల్లో రెండో భాగం వారు కై ంకర్యాలు నిర్వహించేవారు. 1999లో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఒంతులు తీసివేసి ఎనిమిది మంది అర్చకులకు ఉద్యోగాలు కల్పించారు. వీరిలో ప్రథమ భాగంలో వారికి రెండు పోస్టులు, ద్వితీయ భాగం వారికి ఎనిమిది పోస్టులు ఇచ్చారు. అప్పటి నుంచి ప్రథమ భాగంలోని కుటుంబాల వారు తమకు అర్చక పోస్టుల భర్తీలో తీవ్ర అన్యాయం జరిగిందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
నిరాశలో భక్తులు
కోటప్పకొండకు వచ్చే భక్తులు స్వామి వారి అభిషేక సేవలో ఎక్కువగా పాల్గొంటారు. వారం రోజులుగా అభిషేకాలు నిలిపివేయడంతో భక్తులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. మహాశివరాత్రి వరకు స్వామి వారి అభిషేకాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అభిషేక మండపంలో నిర్వహించే అభిషేకాల్లో భక్తులు పాల్గొనాలని సూచిస్తున్నారు. అర్చకుల మధ్య వివాదమే అభిషేకాల నిలిపివేతకు కారణమని తెలుస్తోంది. తిరునాళ్లకు 15 రోజులు ముందు నుంచి అభిషేకాలు నిలిపివేయడం గతంలో ఎన్నడూ లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారికి అర్చకత్వంలో ప్రా ధాన్యం వలనే వివాదం ఏర్పడినట్టు సమాచారం. పర్వదినాల సమయాల్లో మెజారిటి అర్చకులు ఉన్న ద్వితీయ భాగంలోని వారికి అశోచం వస్తే కైంకర్యాలు నిలిపివేస్తారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేశాం. అర్చకులను డిప్యూటేషన్‌పై తీసుకువచ్చి అభిషేక మండపంలో అభిషేకాలు నిర్వహిస్తున్నాం. స్వామి వారి కై ంకర్యాలు యథావిధిగా జరుగుతున్నాయి. అర్చక స్వాములకు అశోచం వచ్చినా స్వామి వారి సేవలు కొనసాగుతున్నాయి.
–డి.చంద్రశేఖర్, ఈవో, కోటప్పకొండ
తాజా వివాదం
ఆలయంలో మూడు అర్చక పోస్టులు భర్తీకి దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారి చేసింది. ఈ పోస్టులను కూడా ద్వితీయ భాగం వారు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోస్టుల భర్తీలో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుందని, ఈవో డి.చంద్రశేఖర్ ఒక్కొక్క పోస్టును రూ.10లక్షలకు విక్రయిస్తున్నారని అర్చకులు గతంలో ఆరోపించారు. దీంతోపాటు ప్రథమ భాగం అర్చకులు పోస్టుల భర్తీలో తమకు జరుగుతున్న అన్యాయంపై న్యాయస్థానాలను, దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తాజాగా భర్తీ చేస్తున్న మూడు పోస్టులు కూడా ద్వితీయ భాగం వారికి ఇస్తే అశోచం వచ్చిన సమయంలో స్వామి వారి కై ంకర్యాలు నిలిచిపోతాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే వారు ఎనిమిది మంది ఉన్నారని మూడు పోస్టులు వారికి ఇస్తే 11 మంది అవుతారని వాదన వినిపిస్తున్నారు. స్వామి వారి కై ంకర్యాలను పూర్తిస్థాయిలో ముగ్గురు అర్చకస్వాములు నిర్వహించడం సాధ్యం కాదని ప్రథమ భాగంలోని కుటుంబాలకు చెందిన వారు చెబుతున్నారు.


