అద్భుత పర్యాటక కేంద్రంగా కొండవీడు
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
చిలకలూరిపేట: ీసఆర్‌డీఏ పరిధిలో అద్భుతమైన పర్యాటక కేంద్రంగా కొండవీడు నిలుస్తుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించనున్న కొండవీడు ఫెస్ట్‌ను పురస్కరించుకొని ప్రచారకార్యక్రమంలో భాగంగా గురువారం చిలకలూరిపేటలో 2కే రన్ నిర్వహించారు. ముందుగా కొండవీడు ఫెస్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలసి జెండా ఊపి 2కే రన్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొండవీడు విశిష్టతను తెలిపే విధంగా కొండవీడు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. కొండవీడు ఉత్సవాల్లో హెలికాప్టర్ రైడ్, బోటింగ్, హార్స్ రైడింగ్, ఫ్లవర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పర్యాటకుల ఆనందానికి లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కొండవీడు ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో డీఎఫ్‌వో కృష్ణప్రియ, ఆర్డీవో మధులత, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ కరిముల్లా, రాష్ట్ర సాంస్కృతిక విభాగం నాయకులు కందిమళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


