ట్విటర్‌లో మహిళల చర్చ ఎక్కువగా దీని గురించే..

What Indian Women Talk About Most On Twitter - Sakshi

కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు మూతపడటంతో ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితమైన విషయం తెలిసిందే. బయట తిరిగేందుకు వీలు లేకపోవడం, చేయడానికి పని కరువవ్వడంతో సోషల్‌  మీడియాపై అధిక సమయం వెచ్చించారు. సమాచారానికి, వినోదానికి, కాలక్షేపానికి ఇదే ప్రధాన మార్గంగా అవతారమెత్తింది. దీనిలోనూ ట్విటర్‌దే పైచేయి. అయితే తాజాగా ఈ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్‌ ఓ సర్వేను నిర్వహించింది. త్వరలో (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతున్న క్రమంలో మహిళపై ఓ పరిశోధన చేసింది.  2019 ఫిబ్రవరి 2021 వరకు భారతీయ మహిళలు ట్విటర్‌లో ఎక్కువగా ఏం మాట్లాడారనే విషయంపై ఈ సర్వే చేపట్టారు.

దీనిలో 10 నగరాల నుంచి ట్విటర్‌లో 5,22,992 మంది చేసిన ట్వీట్లతోపాటు ట్విట్టర్‌లోని 700 మంది మహిళలను ఆధారంగా ఈ సర్వే జరిగింది. మరి ఈ ఫలితాల్లో సరికొత్త విషయాలు తెలిశాయి. రీసెర్చ్‌ ప్రకారం మొత్తంగా తొమ్మిది ముఖ్య అంశాలపై చర్చ ఎక్కువగా జరిగినట్లు తేలింది. ఇందులో అభిరుచులు, ఆసక్తులు టాప్‌లో నిలిచాయి. వీటి శాతం 24.9 శాతం వాటా కలిసి ఉంది. ఇందులో ఫ్యాషన్‌, పుస్తకాలు, అందం, వినోదం, సంగీతం, ఆహారం, టెక్నాలజీ, స్పోర్ట్స్‌ కలిసి ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై(కరెంట్‌ అఫైర్స్‌) 2.08 శాతం మంది మాట్లాడుకున్నారు. ఇక సెలబ్రిటీ మూమెంట్స్‌పై-14.5 శాతం, కమ్యూనిటీలపై-11.7 శాతం, సామాజిక మార్పుపై-8.7 శాతం మంది మహిళలు చర్చించారు. ట్విట్‌లలో లైకులు, రిప్లైల విషయానికొస్తే ఎక్కువగా రోజువారీ ముచ్చట్లు, సెలబ్రిటీల మూమెంట్‌లపై ఎక్కువగా జరిగాయి. ఫ్యాషన్‌, ఆసక్తులు, కమ్యూనిటీస్‌, ఛాలెంజ్‌లపై ఎక్కువగా రీట్వీట్‌లు చేశారు. 

చదవండి: ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్

ఒక అమ్మాయి కోసం నలుగురు ఫైట్‌.. లక్కీ డ్రా!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top