Sakshi News home page

అయోధ్య రామమందిరానికి 400 కేజీల తాళం

Published Mon, Aug 7 2023 5:46 AM

Aligarh artisan makes 400 kg lock, world largest handmade lock, for Ram Mandir - Sakshi

అలీగఢ్‌ (యూపీ): అయోధ్యలో రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన ఒక కళాకారుడు అరుదైన కానుకను రూపొందించాడు. చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన సత్యప్రకాశ్‌ శర్మ రాముడి మందిరం కోసం ప్రత్యేకంగా 400 కేజీల తాళం తయారు చేశాడు. శ్రీరాముడికి వీరభక్తుడైన సత్యప్రకాశ్‌ ప్రపంచంలో చేత్తో తయారు చేసిన  అతి పెద్ద తాళమని చెప్పారు.

ఈ తాళం 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంది.  తాళం చెవి నాలుగడుగుల పొడవుంది. సత్యప్రకాశ్‌ శర్మ కుటుంబం తరాలుగా ఈ తాళాల తయారీ వృత్తిలోనే ఉంది.ఈ ఏడాది మొదట్లో అలీగఢ్‌ ఎగ్జిబిషన్‌లో ఈ తాళాన్ని ఉంచారు.  తాళం తయారు చేయడంలో తన భార్య రుక్మిణి కూడా సాయం చేశారని చెప్పారు. ఈ తాళం తయారీకి ఆయనకి రూ.2 లక్షల ఖర్చయింది. ఈ ఏడాది చివర్లో ఆయన ఈ తాళాన్ని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి సమరి్పస్తారు. 

Advertisement

What’s your opinion

Advertisement