శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ ప్రారంభం

Feb 8 2026 3:56 AM | Updated on Feb 8 2026 3:56 AM

శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ ప్రారంభం

శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ ప్రారంభం

శ్రీశైలంటెంపుల్‌: మహాశివరాత్రి శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఉదయం మనోహర గుండం వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింపచేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను రథవీధిలో మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఊరేగింపుగా తీసుకునివెళ్లి శివదీక్షా శిబిరాలలో ఆశీనులను చేయించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారాలతో పూజాదికాలు నిర్వహించారు. అనంతరం హోమాగ్నిని ప్రజ్వలింపజేశారు. తరువాత శివదీక్షాధారులు నమశ్శివాయ పంచాక్షరీ నామస్మరణతో శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం 18వ తేదీ వరకు దీక్షా విరమణకు అవకాశం కల్పించారు. జనవరి 8న శివమండల దీక్ష, 28న అర్ధమండల దీక్ష విరమణ చేయనున్నార.

జ్యోతిర్ముడి కలిగిన భక్తులకు స్పర్శదర్శనం

శివదీక్షను స్వీకరించి, జ్యోతిర్ముడి కలిగిన భక్తులకు చంద్రవతి కల్యాణ మండపం నుంచి ఆలయ ఉత్తర మాడవీధి ద్వారా ప్రత్యేక దర్శనం క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్‌ ద్వారా నిర్ణీత వేళలలో మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. ఆదివారం నుంచి ఐదు రోజులు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనం కలిస్తారు. శివదీక్ష భక్తులకు సేవలందించేందుకు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement