రైస్‌మిల్‌లో కొండ చిలువలు | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్‌లో కొండ చిలువలు

Feb 8 2026 3:56 AM | Updated on Feb 8 2026 3:56 AM

రైస్‌

రైస్‌మిల్‌లో కొండ చిలువలు

బండిఆత్మకూరు: మండల కేంద్రంలోని ఓ పాత రైస్‌ మిల్‌లో శనివారం అటవీ అధికారులు రెండు కొండ చిలువలను పట్టుకున్నారు. శనివారం ఉదయం రైస్‌మిల్‌ వైపు వెళ్లిన స్థానికులకు రెండు కొండ చిలువలను గమనించి వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు లింగాపురం ఎఫ్‌బీఓ హైమావతితో అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రత్యేక పరికరాలతో కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. ఒక కొండ చిలువ ఏడు అడుగులు, ఇంకొకటి ఆరు అడుగుల పొడవు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం వాటిని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు అధికారులు తెలిపారు.

గుండెపోటుతో అసిస్టెంట్‌ లైన్‌మన్‌ మృతి

గడివేముల: తిరుపాడు గ్రామంలో అసిస్టెంట్‌ లైన్‌మన్‌గా పనిచేస్తున్న వెంకటరమణ (46) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. ఈ మేరకు విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో స్థానికులు, కుటుంబసభ్యులు నంద్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గడివేముల ఏఈ ఖలీల్‌ పాషా, డిప్యూటీ ఎక్యూటివ్‌ ఇంజినీర్‌ సుబ్రమణ్యం, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీమన్నారాయణ, కాంట్రాక్టర్‌ శేషాద్రిగౌడ్‌, సిబ్బంది శివ, రవి, నరేంద్ర, మండల సిబ్బది, తదితరులు నివాళులర్పించారు.

బంగారు దుకాణంలో భారీ చోరీ

● రూ. 40 లక్షల ఆభరణాలు అపహరణ

బనగానపల్లె: పట్టణంలోని రూరల్‌ పోలీసు సర్కిల్‌ కార్యాలయానికి అతి సమీపంలోని ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దొంగలు అపహరించారు. స్థానిక శ్రీని వాస జ్యువెలర్స్‌ దుకాణంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దుకాణం షెట్టర్‌ తాళాలు పగులగొట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ చోరీలో 18 తులాల బంగారు ఆభరణాలు, ఐదు కేజీల వెండి అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం చోరీ విషయం వెలుగు చూడటంతో ముందుగా ట్రైనీ డీఎస్పీ రాజసింహ, సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ దుగ్గిరెడ్డి పరిశీలించారు. గ్యాస్‌ కట్టర్‌తో షట్టర్‌ తాళాలను తొలగించినట్లు గుర్తించారు. నంద్యాల నుంచి ఫింగర్‌ ప్రింట్స్‌ అధికారులు దుకాణాన్ని పరిశీలించి నిందితుల వేలిముద్రలు సేకరించారు. సాయంత్రం డోన్‌ డీఎస్పీ శ్రీనివాసులు దుకాణాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. చోరీ కేసును త్వరలో ఛేదిస్తామన్నారు.

రైస్‌మిల్‌లో కొండ చిలువలు 1
1/2

రైస్‌మిల్‌లో కొండ చిలువలు

రైస్‌మిల్‌లో కొండ చిలువలు 2
2/2

రైస్‌మిల్‌లో కొండ చిలువలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement