పోలీసు డాగ్ ‘టీనా’ మృతి
కర్నూలు:జిల్లా పోలీసు శాఖలో 9 ఏళ్ల పాటు సేవ లందించిన పోలీస్ డాగ్ టీనా వృద్ధాప్య సమస్యలతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఇది ల్యాబ్ బ్రీడ్ జాతికి చెందిన ఫీమేల్ జాగిలం. టీనా మృతదేహానికి దిన్నెదేవరపాడు శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఏఆర్ పోలీసు అధికారులు, డాగ్ స్క్వాడ్ పోలీ సుసిబ్బంది కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మందు పాతరలను పసిగట్టడంలో టీనా దిట్ట. వివిధ వీఐపీ బందోబస్తులో, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి బందోబస్తు విధులలో మంచి సేవలు అందించింది. ఎన్నికల విధులు, శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలు, వీఐపీ విజిట్స్, మంత్రాలయం, తిరుమల బ్రహ్మోత్సవాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిందని టీనా సేవలను పోలీసు అధికారులు కొనియాడారు.2013లో పది నెలల పాటు తెలంగాణ, మొయినాబాద్ ఐఐటీఏలో కఠోరశిక్షణ పూర్తి చేసుకుని 2014లో జిల్లాకు వచ్చింది.


