సాక్ష్యం నమోదుకు దారేదీ?
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చే భక్తులు తప్పనిసరిగా సాక్షిగణపతిని దర్శించుకోవాలి. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నట్లు కైలాసంలో శివుడికి సాక్ష్యం చెబుతారని భక్తుల నమ్మకం. సాక్షి గణపతి స్వామిని దర్శించుకుంటే శ్రీశైల యాత్ర పూర్తవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో కొలువైన సాక్షి గణపతి స్వామి పుస్తకంలో రాస్తున్నట్లు కొలువై ఉంటారు. శ్రీశైల యాత్రకు విచ్చేసిన భక్తులందరి పేర్లను తన వద్ద ఉన్న పుస్తకంలో నమోదు చేసుకుని.. వీరంతా శివుడి దర్శనం చేసుకున్నారని కై లాసంలో స్యాక్షం చెబుతాడని భక్తుల నమ్మకం. స్వామి దర్శనం భక్తుల మనోభావాలు, అధ్యాత్మికతో ముడిపడిన విషయం. అయితే రద్దీ రోజుల్లో ట్రాపిక్ జామ్ పేరుతో పలువురు భక్తులు గణపతిని దర్శించుకోలేక వెనుతిరిగిపోతున్నారు. ఈ ఆలయం అటవీశాఖ పరిధిలోకి వస్తుందని, అక్కడ పార్కింగ్‌కు అటవీశాఖ స్థలం కేటాయించలేదు. దీంతో పలువురు భక్తులు గణపతిని దర్శించుకోకుండానే తమ యాత్రను ముగించుకోవాల్సి వస్తుంది. భక్తుల మనోభావాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ఆలయం వద్ద పూర్తిస్థాయిలో పార్కింగ్‌స్థలం లేకపోవడం, ట్రాఫిక్ సమస్యతో భక్తుల వాహనాలను నిలపకపోవడంతో చాలా వరకు భక్తులు తమ వాహనాలనుంచే ‘స్వామి శ్రీశైలం వచ్చి శివుడిని దర్శించుకుని వెళ్తున్నాం..రాసి పెట్టండి అని’ మనస్సులో తలచుకుని వెళ్తున్నారు. భక్తులు ఆలయానికి వచ్చి కనులారా స్వామిని దర్శించి, మనసారా తన కోర్కెలను చెప్పుకుందామంటే వీలుపడని పరిస్థితి. దీంతో మనస్సులోనే స్మరించుకోవాల్సిన పరిస్థితి.
పార్కింగ్ స్థలం లేక భక్తుల అవస్థలు
సాక్షి గణపతి ఆలయం వద్ద అక్కడ వాహనాలను నిలిపి గణపతిని దర్శించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసు అధికారులు ఆలయ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ చేయనీయడం లేదు. దీంతో దూర ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేసుకుని ఆలయానికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల క్రితం అటవీశాఖ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసినప్పటికీ ప్రతి నిత్యం వేలాది వాహనాల్లో భక్తులు శ్రీశైల యాత్రకు తరలివస్తుండటంతో ఆ స్థలం సరి పోవడం లేదు. ఈ ఆలయం ఉన్న ప్రదేశం అటవీశాఖ పరిధిలో ఉంది. దీంతో అటవీశాఖ పర్యావరణ–పరిరక్షణ పేరుతో సాక్షిగణపతి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు అనుమతించడం లేదు. ఈ సమస్య గత కొన్ని దశాబ్దాలుగా దేవదాయశాఖ, అటవీశాఖల మద్య జరుగుతునే ఉంది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో శ్రీశైలం అతిముఖ్యమైన ప్రదేశమని, ఎన్‌టీసీఏ గైడ్‌లెన్స్ ప్రకారం సాక్షిగణపతి ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేసేందుకు అనుమతించలేమని అటవీశాఖ మొండికేస్తుంది.
కై లాసంలో ఉన్న శివుడికి
సాక్ష్యం చెప్పే గణపతి
సాక్ష్యం చెప్పకుండానే
వెనుదిరుగుతున్న భక్తులు
పార్కింగ్ స్థలం లేక అవస్థలు
స్థలం కేటాయించని అటవీశాఖ
పట్టించుకోని ప్రభుత్వం
భక్తుల మనోభావాలు పట్టవా?
జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో కలగలసిన మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం. ఇల కై లాస మైన శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకోవడంతో భక్తులు ఆధ్యాత్మిక అను భూతి పొందుతారు. అలాగే శివుడిని దర్శించుకున్నట్లు సాక్షిగణపతి స్వామివారిని కూడా దర్శించుకోవడం సంప్రదాయం. అంతేకాకుండా భక్తుల మనోభావాలతో కూడిన విషయం కూడా. అయినప్పటికీ సాక్షిగణపతి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హిందూవాదినని, సనాతనధర్మాన్ని కాపాడుతా.. అని గొప్పలు చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయానా అటవీశాఖ మంత్రి అయినా కూడా భక్తుల మనోభావాలను పట్టించుకోకపోవడంపై పలువురు మండిపడుతున్నారు. అటవీ శాఖ స్థలాన్ని కేటాయిస్తే, దేవదాయశాఖ 1:2 నిష్పత్తిలో భూమి బదలాయింపు చేసే అవకాశం ఉంది. అయినా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాక్ష్యం నమోదుకు దారేదీ?


