పాల ఉత్పత్తిని పెంచేందుకు కృషి
కర్నూలు(అగ్రికల్చర్): పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తి పెంచేందుకు కృషి చేయాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ హేమంత్‌కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఆయన చాంబరులో పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘం, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్‌ల 2026 వెటర్నేరియన్ డెయిరీ, క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరం కలసికట్టుగా రైతుల అభ్యున్నతికి కృషి చేద్దామన్నారు. కర్నూలు డివిజన్ డీడీ వసంతలక్ష్మి, జిల్లా అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.నాగరాజు, పశువైద్యుల సంఘం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ఏడీలు మల్దన్న, ధనుంజయుడు, భవానిశంకర్‌రెడ్డి, పార్థసారథి, వెంకటసుబ్బయ్య, పశువైద్యులు చెన్నకేశవులు, మనోజ్, మదన్, సతీష్ పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ తప్పనిసరి
కర్నూలు(సెంట్రల్): అకాడమిక్ పాస్ పోర్టుగా ఉపయోగపడే అపార్ ఐడీని ప్రతి విద్యార్థి కలిగి ఉండేలా చూడాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య వి.వెకటబసవరావు తెలిపారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ సహకారంతో యూనివర్సిటీ సెనేట్ హాలులో సోమవారం ఒక్క రోజు వర్కుషాపును ఆయ న ప్రారంభించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా భారత ప్రభుత్వం చేపట్టిన వన్ స్టూడెంట్–వన్ ఐడీ కార్యక్రమంలో అపార్ ఐడీ, నేషనల్ అకాడమిక్ డిపాడిటరీల ఏర్పాటు చేసినట్లు వీసీ వివరించారు. ప్రతి ఉన్న త విద్యా సంస్థ ఇందులో భాగస్వామ్యం కావాల ని కోరారు. విద్యార్థుల సర్టిఫికెట్ల జారీ పరిశీలన మొదలైన అంశాలు సులభతం అవుతాయన్నా రు. సదస్సుకు ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలోని యూనివర్సిటీలు హాజరయ్యా యి. కాగా, డిజిలాకర్, అకడమిక్ బ్యాంకు ఆఫ్ క్రెడిట్స్, నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ, అపార్ ఐడీ మొదలైన అంశాలపై నోడల్ అధికారులు వివరించారు. అపార్ ఐడీ క్రియేషన్‌లో ఏమైనా సమస్యలు ఉంటే 18008893511కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ సమన్వయ కర్త రవిపాండే, వర్సిటీ రిజిస్ట్రార్ విజయకుమార్‌నాయుడు పాల్గొన్నారు.
ఇద్దరు పదో తరగతి విద్యార్థులు అదృశ్యం
వెల్దుర్తి: పట్టణానికి చెందిన ఇద్దరు మిత్రులైన పదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలు... రాణితోటలో నివాసముంటున్న పాలిష్ కట్టర్ సలీం కుమారుడు హుసేన్‌బాషా, అలీబాషా కుమారుడు అబ్దుల్ రెహమాన్‌లు స్థానిక బాలుర హైస్కూల్‌లో చదువుతున్నారు. శనివారం పాఠశాలకు వెళ్లి ఇంటర్‌వెల్ సమయంలో ఇద్దరూ బయటకు వెళ్లారు. పాఠశాల నుంచి వెళ్లిన వారు ఇంటికి రాకపోవడంతో ఇరు కుటుంబాల వారు గాలింపు చేసినా ఫలితం లేకపోవడంతో సోమవారం స్థానిక పోలీసులను ఆశ్రయించా రు. విద్యార్థులు కనిపించిన వారు 9121101118 కు తెలపాలని ఎస్‌ఐ నరేశ్ విన్నవించారు.
గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌కార్డు కలిగిన మహిళలకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్ధ డైరెక్టర్ కే.పుష్పక్ తెలిపారు. టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్న ట్లు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుకు ఈ నెల 4వ తేదీ వరకు అవ కాశం ఉందన్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు మహిళలు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నా రు. వివరాలకు 9000710508, 63044 91236 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
ప్రాక్టికల్ పరీక్షలకు 237 మంది గైర్హాజరు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు సోమవారం 237 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 72 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 4,947 మంది విద్యార్థుల్లో 4,781 మంది హాజరై, 166 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 69 కేంద్రాల్లో నిర్వహించిన ప్రాక్టికల్స్‌కు 3917 మంది విద్యార్థుల్లో.. 3846 మంది హాజరై, 71 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు.
పాల ఉత్పత్తిని పెంచేందుకు కృషి
పాల ఉత్పత్తిని పెంచేందుకు కృషి


