శ్రీశైలంలోబ్రహ్మోత్సవ ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పరిశీలించారు. సోమవారం శ్రీశైలంలోని పాతాళగంగ, రోప్‌వే, పార్కింగ్ ప్రదేశాలు, కోనేరు, స్నానఘట్టాలు, ఆలయ పరిసర ప్రాంతాలు, క్యూలైన్లను స్వయంగా పరిశీలించారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతిభద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల భద్రతే ప్రథమంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
మహాశివరాత్రి పోస్టర్ల ఆవిష్కరణ
బనగానపల్లె: మండలంలోని యాగంటి క్షేత్రంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామిదేవస్థానంలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రికి సంబంధించిన పోస్టర్లను బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. మాజీ సర్పంచ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, ఆలయ చైర్మన్ మౌళీశ్వర రెడ్డి, ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ మాజీ సర్పంచ్ రాజారెడ్డి మాట్లాడుతూ.. శివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.
శ్రీశైలంలోబ్రహ్మోత్సవ ఏర్పాట్ల పరిశీలన


