పింఛన్ కోసం దివ్యాంగుడి పోరాటం
అతి కష్టంతోనే కర్నూలులోని కలెక్టరేట్‌కు వస్తున్న ఈయన పేరు పొలుకుంటయ్య. తుగ్గలి మండలం మారెళ్లకు చెందిన ఈయనకు రైల్వే ప్రమాదంలో ఐదేళ్ల క్రితం ఒక కాలు సగానికి తెగిపోయింది. దీంతో కట్టె సాయంతో ఒంటి కాలితోనే నడవాల్సి వస్తోంది. ఏ పని చేయడానికి రాదు. కుటుంబ సభ్యులపైనే ఆధారపడి జీవించాల్సి వస్తోంది. భార్య పిల్లలు కూలి పనికి వెళ్లితే వచ్చే సంపాదనతో బతకాల్సి వస్తోంది. రెండేళ్లుగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. దారుణమైన స్థితిలో ఉన్న తనకు ఆసరా కల్పించాలని కోరుతూ సోమవారం మరోసారి కలెక్టరేట్‌కు వచ్చి అధికారులకు అర్జీ ఇచ్చారు.
– కర్నూలు(సెంట్రల్)


