తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కుమార్తె | - | Sakshi
Sakshi News home page

తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కుమార్తె

Feb 1 2026 3:41 AM | Updated on Feb 1 2026 3:41 AM

తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కుమార్తె

తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కుమార్తె

డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన ప్రియంవద

ఆత్మకూరు: తన తండ్రికి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఓ యువతి అహర్నిశలు శ్రమించారు. ఇటీవల విడుదలైన గ్రూప్‌–1 పరీక్షల్లో విజేతగా నిలిచి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన పెసల హరిబాబుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థానం సాధించాలని కుమార్తెలకు చెప్పేవారు. గ్రూప్‌–1 పోస్టు సాధించాలని మూడో కుమార్తె ప్రియంవదను ప్రోత్సహించేవారు. అయితే 2020లో ప్రపంచాన్ని వణికించిన కరోనా హరిబాబును కాటేసింది. దీంతో పెదనాన్న పెసల దామోదరయ్య తన తమ్ముడి కుమార్తె ప్రియంవద చదువు బాధ్యతను తీసుకున్నారు. చిరు వ్యాపారం చేస్తూనే చదువుపై ధైర్యం కోల్పోకుండా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఆత్మకూరులో పదోతరగతి చదివిన ప్రియంవద హైదరాబాద్‌లో ఇంటర్‌, డిగ్రీ, ఏంబీఏ పూర్తి చేశారు. సివిల్స్‌కు కోచింగ్‌ తీసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. బాధను దిగమింగుకుంటూ విజయమే లక్ష్యంగా ముందుకు సాగారు. గ్రూప్‌–1 పరీక్షలో విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement