నిరంతరం విద్యుత్ సరఫరా
ములుగు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగు సర్కిల్ పరిధిలో నిరంతరం విద్యుత్ సరఫరా అందించామని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) ఆనందం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ములుగు సర్కిల్ పరిధిలోని అన్ని శివాలయాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామన్నారు. మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ వెలుగులతో ఆలయాలు ప్రకాశిస్తున్నాయని వివరించారు. లోడ్ అంచనాలకు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచామని వెల్లడించారు. 24 గంటలు పర్యవేక్షణ చేసేలా అదనపు సిబ్బందిని నియమించామన్నారు. రామప్ప వద్ద 25 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు వివరించారు. సమావేశంలో ములుగు ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రమేష్, సబ్ ఇంజనీర్‌లు సాంబరాజు, శివ పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ ఆనందం


