బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్‌ | - | Sakshi
Sakshi News home page

బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్‌

Feb 16 2026 7:19 AM | Updated on Feb 16 2026 7:19 AM

బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్‌

బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్‌

ములుగు రూరల్‌: బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్‌ మహరాజ్‌ అని, బంజారాల సంస్కృతీ, సంప్రదాయాలతో పాటు కుల దైవాల చరిత్రను భావితరాలకు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని దేవగిరిపట్నంలో సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయంలో ఆదివారం నిర్వహించిన సేవాలాల్‌ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రికి సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయ పూజారి కిషన్‌ మహరాజ్‌ స్వామి తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌, స్థానిక సర్పంచ్‌ పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.

సేవాలాల్‌ మహరాజ్‌ ఆదర్శప్రాయుడు

గోవిందరావుపేట: సేవాలాల్‌ మహరాజ్‌ ఆదర్శప్రాయుడని, ఆయన చూపిన మార్గంలో ప్రతిఒక్కరూ నడవాలని టీఎస్‌టీఈఏ(తెలంగాణ షెడ్యూల్డ్‌ ట్రైబల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌) జిల్లా అధ్యక్షుడు భూక్య సక్రునాయక్‌ అన్నారు. మండల పరిధిలోని పస్రాలో గ్రామ సర్పంచ్‌ భూక్య సుమలత నివాసంలో ఎల్‌హెచ్‌పీఎస్‌, బంజారా రైతుమిత్ర సంఘం, బంజారా కుల పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం సద్గురు సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్‌ మహరాజ్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంజారాలు సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుతూ నీతి నిజాయతీతో ముందుకు సాగాలన్నారు. ఎల్‌హెచ్‌పీఎస్‌ మండల అధ్యక్షుడు లకావత్‌ నరసింహ నాయక్‌ మాట్లాడుతూ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసే నిధులు జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా మండలాల వారీగా కేటాయించాలని కోరారు. ప్రతీ బంజారా తండాలో జయంతిని అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భూక్య సుమలత, జోగా, భద్రమ్మ, పీరమ్మ, మున్నా, రఘురామ్‌, దేవా తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ

మంత్రి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement