వేతన వెతలు
ఉద్యోగుల వివరాలు
వైద్యారోగ్యశాఖలో ఆరు నెలలుగా అందని వేతనాలు
ఏటూరునాగారం: జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న ల్యాబ్ టెక్నిషియన్లు, ఫార్మాసిస్ట్‌లు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులు, ఎక్స్‌రే టెక్నిషియన్స్, కాంటింజెంట్ వర్కర్లు విభాగాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బంది సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. డీఎంఎఫ్‌టీ (కలెక్టర్ ఫండ్) కింద ఔట్‌సోర్సింగ్‌గా పనిచేస్తున్న 28 మంది ఉద్యోగులకు ఆరు నెలల నుంచి వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు. వేతనాలు చెల్లించడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు అధికారులకు విన్నవించినా రేపు.. మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు.
పీహెచ్‌సీలు ఉద్యోగుల
సంఖ్య
బ్రహ్మణపల్లి 4
ఎదిర 1
గోవిందరావుపేట 3
కన్నాయిగూడెం 2
కాటాపురం 3
కోడిశాల 4
పేరూరు 2
తాడ్వాయి 1
వాజేడు 3
వెంకటాపురం(కె) 4
డీఎంహెచ్‌ఓ
ఆఫీస్ వర్కర్ 1
జిల్లా వ్యాప్తంగా 28 మంది
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల
ఎదురుచూపులు
పట్టించుకోని అధికారులు, పాలకులు


