ఆలయ అభివృద్ధికి కృషి
గోవిందరావుపేట: ముయ్యాలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని పస్రా నాగారం (పాతూరు)లో జరుగుతున్న ముయ్యాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని, భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ముయ్యాలమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, నాయకులు గొంది కిరణ్, పులుగుజ్జు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క


