కాటారంలో 2కే రన్
మల్హర్(కాటారం): ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను పురస్కరించుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం కాటారం మండలకేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. ఎస్బీఐ బ్యాంకు నుంచి అంబేడ్కర్ కూడలి వరకు 2కే రన్ సాగగా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. కేవైసీ మోసాల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. తెలియని సందేశాల లింక్‌లను ఓపెన్ చేయొద్దని పేర్కొన్నారు. ప్రతీ బ్యాంకు ఖాతాదారు కేవైసీ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ తిరుపతి, ఎస్సై శ్రీనివాస్, వివిధ బ్యాంకుల మేనేజర్లు ప్రవీణ్, హరిరాంనాయక్, సంతోష్, సికందర్, భాస్కర్, రవినాయక్ పాల్గొన్నారు.


