రామప్ప ఉత్సవ కమిటీ చైర్మన్‌గా అయిలయ్య
వెంకటాపురం(ఎం): రామప్ప ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్‌గా మండల కేంద్రానికి చెందిన మిల్కూరి అయిలయ్యను నియమిస్తూ దేవాదాయశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి రామప్పలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పండుగ వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా మిల్కూరి అయిలయ్య, డైరెక్టర్లుగా ఒడ్డెపల్లి శంకర్, జీడీ రాజు, వంచ తిరుపతిరెడ్డి, కట్కూరి వెంకటేశ్వర్లు, యాట నర్సయ్య, తనగుల విజయ, కల్పనాదేవి, నర్సయ్య, బొద్దుల రాజీరు, మూడు వీరేశ్, నర్సింహారెడ్డిలను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆత్మ చైర్మన్‌గా కర్ల అరుణ
ఏటూరునాగారం: ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ ఒకటవ వార్డుకు చెందిన మాజీ ఉపసర్పంచ్ కర్ల అరుణను ఏటూరునాగారం ఆత్మ చైర్మన్‌గా మంత్రి సీతక్క ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పెద్ద బాధ్యతను అప్పగించినందుకు విధి నిర్వహణలో నిజాయతీగా పనిచేస్తానని తెలిపారు. తన ఎంపికకు సహకరించిన మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్నలకు కృతజ్ఞతలు తెలిపారు.
దేవాదుల మరో రెండు మోటార్లతో నీటి పంపింగ్
కన్నాయిగూడెం: మండలంలోని తుపాకులగూడెం దేవాదుల ఎత్తిపోతల వద్ద మరో రెండు మోటార్లతో నీటి పంపింగ్‌ను గురువారం ప్రారంభించారు. గత కొన్నిరోజుల నుంచి మూడు మోటార్లతో పంపింగ్‌ను కొనసాగించిన అధికారులు గురువారం మరో రెండు మోటార్లను ఆన్‌చేసి నీటిని గొల్లబుద్దారం రిజర్వాయర్‌కు పంపింగ్‌ను కొనసాగిస్తున్నారు. నిన్నటి వరకు ఫేజ్‌టులో ఒకటి, ఫేజ్‌త్రీలో రెండు మొత్తం మూడు మోట్లాతో 831 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసిన ఇంజనీరింగ్ అధికారులు గురువారం ఫేజ్‌త్రీలో మరో రెండు మోటార్లను ప్రారంభించారు. మొత్తం ఐదు మోటార్లతో 13,336 క్యూసెక్కుల నీటిని గొల్లబుద్దారం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి భీమ్‌ఘనపూర్ రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ఎగువ నుంచి 14,750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో అదే మోతాదులో నీటిని దిగవకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
కాళేశ్వరాలయంలో పూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వొడ్డెపల్లి రామచందర్‌రావు, ఎలక్షన్ అబ్జర్వర్ గంగాధర్ గురువారం వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేసి శ్రీశుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి ఆశీర్వచన వేదిక వద్ద వారిని ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ సన్మానించారు. అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు.
త్రివేణి సంగమంలో
హంసవాహనం
కాళేశ్వరం: ఈనెల 15న ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా రాత్రి ఏడు గంటలకు త్రివేణి సంగమంలో హంసవాహనంలో తెప్పోత్సవం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గురువారం సాయంత్రం హంసవాహనం ఆకృతితో గోదావరిలో కూలీలు తయారు చేశారు. దీంతో సగం వరకు తయారైన హంసవాహనం పర్యాటకులు, భక్తులను ముచ్చట గొలుపుతుంది.
రామప్ప ఉత్సవ కమిటీ చైర్మన్‌గా అయిలయ్య
రామప్ప ఉత్సవ కమిటీ చైర్మన్‌గా అయిలయ్య
రామప్ప ఉత్సవ కమిటీ చైర్మన్‌గా అయిలయ్య


