లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలి
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు జంపాల రవీందర్, రత్నం రాజేందర్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గాలు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా లేబర్ కోడ్‌లను తీసుకురావడం దారుణమన్నారు. వెంటనే వాటిని రద్దు చేయాలని కోరారు. అలాగే స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించి కనీస వేతనం రూ. 26 వేలు అందించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. సివిల్ సప్లయీస్, హమాలీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమ్జద్‌పాషా, స్వామి, సాంబయ్య, రాంబాబు, రాజు, రాజేందర్, దేవేందర్, కమలక్క, భారతి, సరోజన తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకుల
డిమాండ్


