ముసలయ్య జాతరకు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

ముసలయ్య జాతరకు ఏర్పాట్లు పూర్తి

Feb 12 2026 7:15 AM | Updated on Feb 12 2026 7:15 AM

ముసలయ్య జాతరకు ఏర్పాట్లు పూర్తి

ముసలయ్య జాతరకు ఏర్పాట్లు పూర్తి

ములుగు రూరల్‌: మండల పరిధిలోని రాయినిగూడెంలో గుట్టమీది ముసలయ్య జాతరకు పూజారులు తేదీలను ఖరారు చేయడంతో పాటు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ తవిటి నారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం గుడిశుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు గుట్టమీది ముసలయ్య జాతర నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొ క్కులు చెల్లించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తవిటి పుష్పక్క, రాములు, సమ్మయ్య, రామస్వామి, విజయ, సర్పంచ్‌ ఈసం సునీత, ఉప సర్పంచ్‌ దేవేందర్‌రావు, ఆలయ ప్రచార కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement