ఆర్టీసీ జాతర ఆదాయం రూ.20.24కోట్లు
డిపోల వారీగా తిరిగిన బస్సులు, ఆదాయం(రూలలో)
డిపో బస్సులు కిలో మీటర్లు ప్రయాణికులు ఆదాయం
హనుమకొండ 387 5 18,722 2,55,732 3,90,34,592
జనగామ 180 2,86,666 67,148 1,86,79,760
వరంగల్–1 283 4,05,208 2,64,785 3,23,88,513
వరంగల్–2 217 5,92,450 3,41,593 4,61,28,361
మహబూబాబాద్ 117 2,08,548 46,931 1,06,53,950
నర్సంపేట 152 2,30,372 85,857 1,64,85,955
పరకాల 175 2,50.260 84,574 1,72,40,378
తొర్రూరు 110 1,82,469 40,802 1,06,16,240
భూపాలపల్లి 90 1,31,460 46,163 1,12,00,375
హన్మకొండ: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు నడిపిన టీజీఎస్ ఆర్టీసీ రూ.20,24,124లు ఆదాయం రాబట్టుకుంది. జాతరకు 1,711 ప్రత్యేక బస్సులు నడిపి, 9,203 బస్ డేస్‌లలో, 25,027 ట్రిప్పుల ద్వారా మొత్తం 28,06,155 కిలోమీటర్లు నడిపింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. జాతరలో మొత్తం 12,33,585 మంది ప్రయాణికులు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందులో 6,08,686 మంది మహిళ(ఉచిత టికెట్)లు కాగా, 5,12,399 మంది చార్జీల చెల్లింపు ప్రయాణికులు ఉన్నారు.
మేడారానికి మొత్తం ట్రిప్పులు 25,027 తిరిగిన మొత్తం కిలో మీటర్లు 28,06,155


