పోలీసుల సేవలు అభినందనీయం
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
ములుగు రూరల్: మేడారం మహాజాతర విజయవంతంలో పోలీసుల సేవలు అభినందనీయమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్‌లో మంగళవారం అధికారులకు, సిబ్బందికి బడాఖాన ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎస్పీ మాట్లాడారు. రాష్ట్ర బెటాలియన్, జోన్లు, సెక్టారుల్లో విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పోలీస్ సిబ్బంది నృత్యాలు, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌బట్, డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని నారాయణగిరిపల్లెలో కోతుల బెడద తీవ్రంగా ఉండడంతో గ్రామపంచాయతీ అధికారులు ఎలుగుబంటి డ్రెస్ తెప్పించి సిబ్బందికి వేసి మంగళవారం వాడవాడలా తిరిగారు. ఎలుగుబంటి వేషదారుడితో పాటు జీపీ సిబ్బంది, గ్రామస్తులను చూసిన కోతులు వానగుట్టవైపు తరలివెళ్లాయి.
పోలీసుల సేవలు అభినందనీయం
పోలీసుల సేవలు అభినందనీయం


