పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి
ములుగు: 24 నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని జిల్లా ఉపాధి హామీ ఉద్యోగుల జాక్ చైర్మన్ నారగోని సునీత కోరారు. ఈ మేరకు మంగళవారం డీఆర్‌డీఓ శ్రీనివాసరావుకు ఉపాధి సిబ్బందితో కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం మేరకు అన్ని మండలాల్లో ఈ నెల 16 నుంచి ఉపాధి హామీ కార్యాలయాలు మూసివేస్తామని తెలిపారు. రెండేళ్లుగా ఆఫీస్ మెయింటెనెన్స్, కరెంట్, ఇంటర్నెట్ బిల్లులు, ప్రింటర్స్ పేపర్, స్టేషనరీ బిల్లులు చెల్లించకపోవడంతో ఉపాధి హామీ ఉద్యోగులు అప్పులు చేసి కార్యాలయాల నిర్మాణ ఖర్చులు భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు రాజు, కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దబోయిన శ్రీనివాస్, ఈసీల సంఘం నుంచి మనోహర్, ప్లాంటేషన్ మేనేజర్ కిశోర్, నరేందర్, గణేశ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


