ముగిసిన సీఎం కప్ క్రీడాపోటీలు
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడాపోటీలు ముగిశాయని జిల్లా యువజన క్రీడల అధికారి రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కప్ క్రీడలు 28 విభాగాలలో పోలీసులు నిర్వహించగా 1100 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మెడల్స్‌తో పాటు ప్రశంసపత్రాలు అందించినట్లు వెల్లడించారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ఐ సెక్రటరీ వేణు, ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ ఆదినారాయణ, కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అబ్బు, పీడీ మల్లయ్య, పీటీలు, కోచ్‌లు పాల్గొన్నారు.


