బోనమెత్తిన మహిళలు
మహాదేవపూర్ మండల కేంద్రంలో మల్లన్న బోనాల జాతర పండుగ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి మొక్కులు చెల్లించారు. సోమవారం మహారాష్ట్రతో పాటు తెలంగాణ నుంచి భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామికి బోనం సమర్పించారు. ఒగ్గు కళాకారుల డోలు వాయిద్యాల నడుమ భక్తులు మల్లన్న స్వామికి ఇష్టమైన గజ్జల లాగులు వేసుకొని నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పూజారి జాడి శ్రీశైలం, జాడి గట్టయ్య, జాడి వెంకయ్య, సమ్మయ్య, జాడి గట్టయ్య, రాజేందర్, రేగుల భాస్కర్, లక్ష్మి దేవర పూజారులు పాల్గొన్నారు.
– కాళేశ్వరం


