అభివృద్ధి చేసే వారికే ఓటు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేసే వారికే ఓటు

Feb 8 2026 3:56 AM | Updated on Feb 8 2026 3:56 AM

అభివృ

అభివృద్ధి చేసే వారికే ఓటు

దోమల స్వైరవిహారం

7వ వార్డులో సైడ్‌ డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది.

– సానికొమ్ము శ్రీధర్‌రెడ్డి, 7వ వార్డు

ములుగు : ప్రతీ వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కోతుల బెడదతోపాటు వీధిదీపాలు లేకపోవడంతో కాలనీల్లో కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. తొలిసారిగా ములుగు మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. పట్టణంలోని 20 వార్డుల పరిధిలో సుమారు 16 వేల మంది జ నాభా, 13,963 మంది ఓటర్లు ఉన్నారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేసే వారికే తాము ఓటు వేస్తామని ములుగు వాకర్స్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తంగేడు స్టేడియంలో శనివారం నిర్వహించిన ‘సాక్షి’ చర్చావేదికలో వా కర్స్‌ పాల్గొని తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. నూతనంగా కొలువుదీరే పాలకవర్గం పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు.

ఆటస్థలం లేక ఇబ్బందులు

ములుగు పట్టణంలో పిల్లలు ఆడుకునేందుకు క్రీడాస్థలం లేదు. పిల్లలకు ఆటస్థలాన్ని కేటాయించడంతో పాటు వస్తువులను సమకూర్చాలి. పిల్లల పార్కు నిర్మిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

– తాడెం తిరుపతి, ములుగు

అర్హులకు పింఛన్లు అందించాలి

పార్టీలకతీతంగా అర్హులను గుర్తించి పింఛన్లు అందించాలి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అసలైన పేదలకు చేరాలి. పార్టీల పేరుతో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం చేయొద్దు.

– పాముకుంట్ల కుమార్‌, ములుగు

ట్రాఫిక్‌ సమస్యతో ఇబ్బందులు

ములుగు పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. పార్కింగ్‌ స్థలాలు లేకపోవడంతో వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్‌ చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

– మాలోత్‌ రమేష్‌, ములుగు

కోతులు, కుక్కల సమస్యను

పరిష్కరించాలి

పట్టణంలో కోతులు, కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. బడికి వెళ్లే విద్యార్థులను సైతం కోతులు గాయపరుస్తున్నాయి. ఇళ్లపై గంతులు వేస్తూ ఇంట్లో లేని సమయంలో వంటసామగ్రిని చిందరవందర చేస్తున్నాయి. కుక్కల బెడద తీవ్రంగా ఉంది.

– పరికరాల విక్రమ్‌, ములుగు

మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి

ములుగు పట్టణ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలి. గట్టమ్మ ఆలయం నుంచి జంగాలపల్లి వరకు బైపాస్‌ రోడ్డు నిర్మించాలి. వర్షాకాలంలో డ్రెయినేజీలు పొంగి ప్రవహిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

– జనగాం బాబురావు, ములుగు

రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలి

మినీ గ్రౌండ్‌ నిర్మించి సదుపాయాలు కల్పించాలి

అర్హులైన లబ్ధిదారులకు

సంక్షేమ పథకాలు అందించాలి

‘సాక్షి’ చర్చా వేదికలో

ములుగు వాకర్స్‌ల మనోగతం

తొలిసారిగా ములుగు మున్సిపాలిటీ ఎన్నికలు

అభివృద్ధి చేసే వారికే ఓటు1
1/7

అభివృద్ధి చేసే వారికే ఓటు

అభివృద్ధి చేసే వారికే ఓటు2
2/7

అభివృద్ధి చేసే వారికే ఓటు

అభివృద్ధి చేసే వారికే ఓటు3
3/7

అభివృద్ధి చేసే వారికే ఓటు

అభివృద్ధి చేసే వారికే ఓటు4
4/7

అభివృద్ధి చేసే వారికే ఓటు

అభివృద్ధి చేసే వారికే ఓటు5
5/7

అభివృద్ధి చేసే వారికే ఓటు

అభివృద్ధి చేసే వారికే ఓటు6
6/7

అభివృద్ధి చేసే వారికే ఓటు

అభివృద్ధి చేసే వారికే ఓటు7
7/7

అభివృద్ధి చేసే వారికే ఓటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement