ఇళ్లు మంజూరు చేయాలి
పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి. ఇళ్లు లేని పేదలు వందల్లో ఉంటే పదుల సంఖ్యలో మాత్రమే ఇళ్లు ఇస్తుండడంతో మిగిలిన వారు ఇబ్బందులకు గురవుతున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి.
– కొయ్యల రాజు, ములుగు
రోడ్లు లేక ఇబ్బందులు
కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గుంతలమయమైన రోడ్లపై వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నాం. రహదారులను విస్తరించి సీసీ రోడ్లను నిర్మించాలి
–ములకాల శ్రీను, ములుగు
స్విమ్మింగ్‌పూల్ నిర్మించాలి
సరైన వ్యాయామం స్విమ్మింగ్ పూల్‌తోనే సాధ్యం. స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తే చిన్నారులు ఈత నేర్చుకోవడానికి సులభంగా ఉండడమే కాకుండా వాకింగ్ చేసేవారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
– ఇంజపూరి వెంకట్, ములుగు
మినీ గ్రౌండ్ నిర్మించాలి
ములుగు పట్టణంలో మినీ గ్రౌండ్ నిర్మించాలి. పోలీసు, ఆర్మీ తదితర ఉద్యోగాలు సాధించేందుకు కోచింగ్ కోసం వరంగల్‌కు వెళ్తున్నారు. గ్రౌండ్ నిర్మించి సదుపాయాలు కల్పించాలి.
– గడ్డం క్రాంతికుమార్, ములుగు
ఇళ్లు మంజూరు చేయాలి
ఇళ్లు మంజూరు చేయాలి
ఇళ్లు మంజూరు చేయాలి


