రామప్పను సందర్శించిన 13 దేశాల ప్రతినిధులు
వెంకటాపురం(ఎం) : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని 13 దేశాలకు చెందిన 28 మంది ప్రతినిధులు శనివారం సందర్శించారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో శిక్షణ పొందుతున్న లెబనాన్, టర్కీ, ఉజ్జెకిస్తాన్, జింబాబ్వే, ఈజిప్ట్, మొరాకో, ఇథియోపియా, టాంజానియా, లైబీరియా, మాలి, బోట్స్వానా, మారిషన్, గ్వాబెమాల దేశాలకు చెందిన 28 మంది ప్రతినిధులు కోర్స్ డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో రామప్పను సందర్శించగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్‌పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. వారి వెంట ఎంసీహెచ్‌ఆర్‌డీ కోఆర్డినేటర్‌లు నంద కిషోర్, రవి, గౌతమ్, సీఐ సురేష్, ఎస్సై చల్ల రాజు, టూరిస్ట్ పోలీసులు ఉన్నారు.


