డిగ్రీ కళాశాలలో జాతీయస్థాయి సెమినార్‌ | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ కళాశాలలో జాతీయస్థాయి సెమినార్‌

Feb 5 2026 7:16 AM | Updated on Feb 5 2026 7:16 AM

డిగ్రీ కళాశాలలో జాతీయస్థాయి సెమినార్‌

డిగ్రీ కళాశాలలో జాతీయస్థాయి సెమినార్‌

డిగ్రీ కళాశాలలో జాతీయస్థాయి సెమినార్‌

ములుగు రూరల్‌: ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 6, 7వ తేదీలలో జాతీయస్థాయి సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ కొప్పుల మల్లేశ్‌ తెలిపారు. కళాశాలలో ‘ఎం పవరింగ్‌ రీసెర్చ్‌ ఎక్సెలెన్స్‌ ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ టూర్‌ ఫర్‌ అకాడమి రైటింగ్‌ అండ్‌ పబ్లిషింగ్‌’ అనే అంశంపై నిర్వహించనున్న సెమినార్‌ బ్రోచర్లను అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, సంపత్‌రావులు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో జాతీయస్థాయి సెమినార్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌ మల్లేశం మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సెమినార్‌కు దేశవ్యాప్తంగా వందమంది పరిశోధకులు, విద్యావేత్తలు, అధ్యాపకులు తరలివచ్చి తమ పరిశోధన పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బాలయ్య, కవిత, భాస్కర్‌, సరిత, శిరీష, రాధిక, అనిల్‌ కుమార్‌, ఉదయశ్రీ, విజేత, శంకర్‌, సోమన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement