అప్పుచేసి పెట్టుబడి పెట్టాను..
ప్రభుత్వం రైతుభరోసా నిధులను సకాలంలో విడుదల చేయాలి. యాసంగి సీజన్ ప్రారంభమై నెలరోజులు గడిచినా పెట్టుబడి సాయం అందలేదు. దీంతో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి అప్పులు చేసి పెట్టుబడి పెట్టాను. పంటల కాలం ప్రారంభానికి ముందే రైతు భరోసా నిధులు విడుదల చేస్తే రైతుకు ఆసరాగా ఉంటుంది.
– ఇమ్మడి భిక్షపతి, రైతు, ములుగు
ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం తక్షణమే అందించి ఆదుకోవాలి. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో పంటలు సాగు చేస్తే దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా రాలేదు. యాసంగి సాగు చేసేందుకు పెట్టుబడి లేక ఎదురుచూడాల్సి వస్తుంది. ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో వెంటనే జమ చేయాలి.
– కొనుపుల కృష్ణ, రైతు, ములుగు
అప్పుచేసి పెట్టుబడి పెట్టాను..


