వేడెక్కిన ఓరుగల్లు | - | Sakshi
Sakshi News home page

వేడెక్కిన ఓరుగల్లు

Feb 5 2026 7:16 AM | Updated on Feb 5 2026 7:16 AM

వేడెక్కిన ఓరుగల్లు

వేడెక్కిన ఓరుగల్లు

మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ‘మున్సిపల్‌’ పోరు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో వార్డులు, బరిలో ఉన్న అభ్యర్థులు

మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ‘మున్సిపల్‌’ పోరు

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

మ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియగా.. 260 వార్డులకు 1,073 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో సాగుతుండగా, బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ప్రచారానికి మరో ఐదు రోజులే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి.

రెబల్స్‌పై బుజ్జగింపుల అస్త్రం

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా ఆరు రోజులే ఉండడంతో రెబల్స్‌ను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో పోటీ చేస్తుండగా.. 40 చోట్ల రెబల్స్‌ బెడద ఉంది. ఒంటరి పోరు చేస్తున్న బీఆర్‌ఎస్‌కు సైతం రెబల్స్‌ సెగ తాకుతోంది. నర్సంపేట, వర్ధన్నపేటలో ఎనిమిది చోట్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెబల్స్‌ ఉన్నారు. మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 12 మంది, బీఆర్‌ఎస్‌ నుంచి 06 ఆరుగురు రెబల్‌ అభ్యర్థులుగా పోటీలో ఉండగా, వారితో పార్టీ నేతలు మంతనాలు చేస్తున్నారు. డోర్నకల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి నలుగురు, మరిపెడలో కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు, బీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు, కేసముద్రంలో కాంగ్రెస్‌ నుంచి ఒక్కరు, బీఆర్‌ఎస్‌లో ఇద్దరు చొప్పున రెబల్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరందరితో ఆ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు నేడో రేపో కొలిక్కి రావచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 12 మున్సిపాలిటీల్లో మొత్తం 260 వార్డులకుగాను ఒకచోట బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురికాగా 26 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేరు.

అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతల ప్రచారం

ఈనెల 8న భూపాలపల్లికి

సీఎం రేవంత్‌రెడ్డి..

బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రులు

కేంద్ర మంత్రులు వస్తారంటున్న

బీజేపీ నేతలు

జిల్లా మున్సిపాలిటీ వార్డులు బరిలో ఉన్న

అభ్యర్థులు

భూపాలపల్లి భూపాలపల్లి 30 107

ములుగు ములుగు 20 83

హనుమకొండ పరకాల 22 101

వరంగల్‌ నర్సంపేట 30 120

వర్ధన్నపేట 12 50

జనగామ జనగామ 30 127

స్టేషన్‌ఘన్‌పూర్‌ 18 82

మహబూబాబాద్‌ మహబూబాబాద్‌ 36 155

డోర్నకల్‌ 15 64

కేసముద్రం 16 58

మరిపెడ 15 63

తొర్రూరు 16 63

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement