విమర్శలకు ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విమర్శలకు ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి

Feb 5 2026 7:16 AM | Updated on Feb 5 2026 7:16 AM

విమర్శలకు ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి

విమర్శలకు ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి

విమర్శలకు ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి

మంగపేట: మంత్రి సీతక్కపై మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌ విమర్శలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధిహామీ మండలి(టీఎస్‌ఈజీసీ) డైరెక్టర్‌ గుమ్మడి సోమయ్య హితువు పలికారు. మండల పరిధిలోని కమలాపురంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రామ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం మాజీ మంత్రి చేసిన వ్యాక్యలు సరికాదన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో మంత్రిగా పనిచేసిన సత్యవతిరాథోడ్‌ ములుగులో ఏమి అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ పాలనలో జిల్లా అభివృద్ధి జరిగిందా లేదా కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో అభివృద్ధి ఎంతమేరకు జరిగిందనేది జిల్లా ప్రజలకు తెలుసని వివరించారు. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి సీతక్క సీఎం సహకారంతో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దక్కిందన్నారు. మేడారం మహాజాతరకు ప్రభుత్వం రూ.210 కోట్లు కేటాయించడంతో పాటు నెలరోజుల్లోనే అభివృద్ధి పనులు పూర్తిచేసి జాతరను విజయవంతం చేస్తే జీర్ణించుకోలేక ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సీతక్క ఆధ్వర్యంలో మహాజాతర సకె్‌స్‌స్‌ కావడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చే మెప్పును చూసి జీర్ణించుకోలేక సోషల్‌ మీడియా, పెయిడ్‌ ఆర్టిస్టులతో బురద జల్లడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

టీఎస్‌ఈజీసీ సభ్యుడు సోమయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement