మున్సిపోల్‌కు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

మున్సిపోల్‌కు ఏర్పాట్లు పూర్తి

Feb 3 2026 7:51 AM | Updated on Feb 3 2026 7:51 AM

మున్స

మున్సిపోల్‌కు ఏర్పాట్లు పూర్తి

మున్సిపోల్‌కు ఏర్పాట్లు పూర్తి

సిబ్బందికి శిక్షణ ఇచ్చాం..

నేడు నామినేషన్ల ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు

మాట్లాడుతున్న మున్సిపల్‌

కమిషనర్‌

రమేశ్‌

ములుగు: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్‌ కమిషనర్‌ తన్నీరు రమేశ్‌ తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ కార్యాలయంలో ఆయన సోమవారం సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపాలిటీ పరిఽధిలో 16,533 మంది జనాభా ఉండగా.. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు 20 వార్డులకు గాను 20 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని వివరించారు. 13,963 మంది ఓటర్లలో 6,661 మంది పురుషులు, 7,300 మహిళలు, ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.

గుర్తుల కేటాయింపు ఇలా..

నేడు(మంగళవారం) మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకునే అవకాశం ఉందని, బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను 3 గంటల తర్వాత ప్రకటించి గుర్తులు కేటాయిస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటలలోపు పార్టీ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన వారు బీ ఫారం సమర్పించకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తామని చెప్పారు. 20 వార్డుల నుంచి అభ్యర్థులు నామినేషన్‌ వేశారని తెలిపారు. సోమవారం 19వ వార్డులో ఒక అభ్యర్థి నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారని వివరించారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద సౌకర్యాలు

20 వార్డులకు 20 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. తాగునీటి వసతి, మరుగుదొడ్లు, ర్యాంపులు, ఫర్నీచర్‌, లైటింగ్‌, వికలాంగులు, వృద్ధులకు వీల్‌చైర్లు వంటి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ జరగనున్న నేపథ్యంలో 50 బ్యాలెట్‌ బాక్స్‌లు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ములుగు డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడమే కాకుండా స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ కేంద్రాలను డీగ్రీ కళాశాలలోనే ఏర్పాటు చేసినట్లు ఉద్ఘాటించారు.

విధుల్లో 24 మంది పీఓలు,

74 మంది ఏపీఓలు

సాక్షితో మున్సిపల్‌ కమిషనర్‌

తన్నీరు రమేశ్‌

మున్సిపల్‌ ఎన్నికల కోసం ఏడుగురు (ఆర్‌ఓ) రిటర్నింగ్‌, ఏడుగురు (ఏఆర్‌ఓ)అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, 24 మంది పీఓ(పోలింగ్‌ ఆఫీసర్లు)లు, 74 మంది ఏపీఓ(ఆసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్లు)లను నియమించినట్లు తెలిపారు. సోమవారం ములుగు బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్నికల విదుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. బుధవారం రెండోసారి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 20 శాతం సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా 201 గృహాలకు చెందిన రూ.3,33,435 ఇంటి పన్నుల బకాయిలు వసూలు అయ్యాయని వివరించారు.

మున్సిపోల్‌కు ఏర్పాట్లు పూర్తి
1
1/2

మున్సిపోల్‌కు ఏర్పాట్లు పూర్తి

మున్సిపోల్‌కు ఏర్పాట్లు పూర్తి
2
2/2

మున్సిపోల్‌కు ఏర్పాట్లు పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement