‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి

Feb 3 2026 7:51 AM | Updated on Feb 3 2026 7:51 AM

‘పది’

‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి

‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి సోషల్‌ టాలెంట్‌ టెస్ట్‌లో కృష్ణకు ప్రథమ స్థానం లయన్స్‌ క్లబ్‌కు 12 అవార్డులు జేసీబీ సీజ్‌ అధ్యక్షుడిగా కమలాకర్‌

ములుగు: పదోతరగతి విద్యార్థులు ప్రణాళికతో చదివి వందశాతం ఫలితాలు సాధించేలా డీఎన్‌ఆర్‌ ట్రస్టు కృషి చేస్తుందని డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, వెంకటాపురం(ఎం) జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు టెన్త్‌ స్టడీ మెటిరీయల్‌ను ట్రస్టు అధినేత దొడ్డ ప్రతాప్‌రెడ్డి అందజేయగా డీఈఓ విద్యార్థులకు సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ సూర్యనారాయణ, పరీక్షల నియంత్రణ అధికారి వినోద్‌కుమార్‌, కో ఆర్డినేటర్లు రాజు, శ్యాంసుందర్‌, సాంబయ్య, శ్రీనివాస్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు రాధిక, భాగ్యలక్ష్మి, సురేష్‌, రమేష్‌, పుష్ప, డాక్టర్‌ కందాల రామయ్య, జనగాం బాబురావు, విక్రమ్‌, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఏటూరునాగారం: ములుగులో నిర్వహించిన జిల్లా స్థాయి సోషల్‌ టాలెంట్‌ టెస్ట్‌లో ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్‌ పదో తరగతి విద్యార్థిని కె.కృష్ణ జిల్లా ప్రఽఽథమ స్థానంలో నిలిచిందని హెచ్‌ఎం సాంబశివరావు తెలిపారు. ఇప్పటి వరకు ఆమె మూడు పర్యాయాలు జిల్లాస్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిందని వెల్లడించారు.

ములుగు: హనుమకొండలోని నిత్య బంకెట్‌హాల్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన లయన్స్‌ ఇంటర్నేషనల్‌ 320 ఎఫ్‌ రెండో రీజనల్‌ ప్రాంతీయ మహాసభలో ములుగు లయన్స్‌ క్లబ్‌కు 12 ఆవార్డులు వచ్చినట్లు క్లబ్‌ అధ్యక్షుడు దొంతి రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లయన్స్‌క్లబ్‌ చేసిన సేవలకు గాను ఫస్ట్‌– బెస్ట్‌ మెంబర్షిప్‌ గ్రోత్‌, బెస్ట్‌ క్యాలెండర్‌ ఈవెంట్స్‌, బెస్ట్‌ చైల్డ్‌ వూడ్‌ క్యాన్సల్‌, బెస్ట్‌ అవేర్నెస్‌, బెస్ట్‌ నీడ్‌ బేసిక్‌ ఆక్టివిటీ, బెస్ట్‌ ఎన్విరాన్మెంట్‌, ఫస్ట్‌ బెస్ట్‌ స్క్రబ్‌ బుక్‌, బెస్ట్‌ ఫొటో ఎగ్జిబిషన్‌, ఫస్ట్‌ రీచ్డ్‌ 9 అవార్డులతో పాటు, బెస్ట్‌ లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడుగా శ్రీనివాస్‌రెడ్డి, బెస్ట్‌ కార్యదర్శిగా చుంచు రమేష్‌, బెస్ట్‌ కోశాధికారిగా ఆడెపు రమేష్‌లు ఆవార్డులు అందుకున్నారు. మధ్యప్రదేశ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పరికపండ్ల నరహరి, రీజినల్‌ ఛైర్‌ పర్సన్‌ పద్మజాదేవి చేతుల మీదుగా ఆవార్డులు తీసుకున్నట్లు వెల్లడించారు.

మంగపేట: మంగపేట రేంజ్‌ పరిధిలోని మల్లూరు సెక్షన్‌లో రిజర్వు ఫారెస్టులో పోడుభూమి కోసం చెట్లను తొలిగిస్తున్న జేసీబీని సోమవారం సీజ్‌ చేసినట్లు మంగపేట రేంజ్‌ అధికారి అశోక్‌ తెలిపారు. రేంజ్‌ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మల్లూరుకు చెందిన వర్స రాము ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూమిలో ఉన్న చెట్లను తొలిగిస్తుండగా బీటాఫీసర్‌ రషీద్‌ బేస్‌క్యాంప్‌ సిబ్బంది జేసీబీని పట్టుకున్నారు. ఆర్‌ఓ ఎఫ్‌ఆర్‌ భూమి విస్తరణకు యంత్రాలతో చెట్లను తొలిగిస్తుండగా పట్టుబడిన జేసీబీని రేంజ్‌ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసి సీజ్‌ చేసినట్లు తెలిపారు.

టీఎస్‌ఎస్‌టీఎఫ్‌ జిల్లా

ములుగు: తెలంగాణ సోషల్‌ స్టడీస్‌ టీచర్స్‌ ఫోరం (టీఎస్‌ఎస్‌టీఎఫ్‌) జిల్లా అధ్యక్షుడిగా బొంతల కమలాకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ములుగు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాయం వీర నారాయణ, సెక్రటరీగా మందపెల్లి కృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా యాకూబ్‌రెడ్డి, మహిళ అధ్యక్షురాలిగా ప్రమీల, సలహాదారులుగా నాగేశ్వర్‌రావు, దేవ్‌సింగ్‌ తదితరులను ఎన్నుకున్నారు.

‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి
1
1/3

‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి

‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి
2
2/3

‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి

‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి
3
3/3

‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement