ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
దోమల మందు పిచికారీ పనులను పరిశీలిస్తున్న డీపీఓ వెంకయ్య, అధికారులు
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాజాతర అనంతరం భక్తుల రద్దీ కాస్త తగ్గడంతో భక్తులు విడిది చేసిన ప్రాంతాల్లోని చెత్తాచెదారాన్ని, ప్లాస్టిక్, ఇతర వస్తువులను సేకరించి ట్రాక్టర్లలో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. పలు సెక్టార్ల పరిధిలోని మేడారం, నార్లాపూర్, చింతల్ క్రాస్, ఊరట్టం, ఆర్టీసీ బస్టాండ్, చిలుకలగుట్ట, కన్నెపల్లి, కొత్తూరు ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. మంత్రి సీతక్క స్వచ్ఛమైన మేడారంగా తీర్చిదిద్ది గ్రామస్తులకు అప్పగించాలని ఆదేశించారు. దీంతో డీపీఓ వెంకయ్య పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా ట్రాక్టర్‌తో కెమికల్ స్ప్రే చేయిస్తున్నారు.
డంపింగ్ యార్డుకు చెత్త తరలింపు
పనులను పర్యవేక్షించిన
డీపీఓ వెంకయ్య
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు


