రామప్పను చూసొద్దాం.. | - | Sakshi
Sakshi News home page

రామప్పను చూసొద్దాం..

Jan 26 2026 5:03 AM | Updated on Jan 26 2026 5:03 AM

రామప్

రామప్పను చూసొద్దాం..

రామప్పను చూసొద్దాం.. మేడారం భక్తులకు ఆలయం సన్నద్ధం

6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా

సౌకర్యాలు అంతంత మాత్రమే!

180 మందితో పోలీసు బందోబస్తు

వెంకటాపురం(ఎం): మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు తరలివచ్చే భక్తజనం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర ఉండగా ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు మేడారం భక్తులతో రామప్ప ఆలయం కిటకిటలాడనుంది. మేడారం దారిలో ఉన్న లక్నవరం సరస్సు సందర్శనను అధికారులు పూర్తిగా నిలిపి వేయనుండడంతో రామప్ప ఆలయానికి మేడారం భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. మేడారంను సందర్శించి తిరుగు ప్రయాణంలో రామప్పకు వచ్చే భక్తులు రామప్పలో ఒకరోజు విడిది చేసి రామలింగేశ్వరుడిని దర్శించుకుని వెళ్తారు. ఆలయానికి సుమారు 6 లక్షల నుంచి 8 లక్షల మంది మేడారం భక్తులు సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రామప్పను సందర్శించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్‌, ఎస్సై చల్లా రాజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

సౌకర్యాలు అంతంత మాత్రమే

రామప్పను సందర్శించే మేడారం భక్తుల కోసం తా గునీటి వసతిని అంతంత మాత్రంగానే ఉంది. ఆలయం శివారులోని రెండు ట్యాంకులకు మాత్ర మే మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. హెలిపాడ్‌ పార్కింగ్‌ వద్ద ఉన్న వాటర్‌ ట్యాంకుకు నీటిని సరఫరా చేసేందుకు నూతనంగా బోరు వేసినప్పటికీ కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా మారింది. పార్కింగ్‌ ప్రాంతంలో 30 తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించినప్పటికీ నీటి వసతి కల్పించకపోవడంతో అలంకారప్రాయంగానే మిగిలాయి. ఆలయ పరిధిలో 32, రామప్ప గార్డెన్‌లో 32 ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు.

క్యూలైన్ల ఏర్పాటు

రామప్పను సందర్శించే మేడారం భక్తుల కోసం ఆలయ అధికారులు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం ముందు కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవడానికి నల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి పనిచేయకపోవడంతో ఆలయం ఎదుట డ్రమ్ములు ఏర్పాటు చేసి నీళ్లు నింపుతున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రామలింగేశ్వరుని దర్శన వేళలు ఉండగా మేడారం భక్తుల కోసం రాత్రి 9 గంటల వరకు ఆలయ దర్శన వేళలు పొడగించాలని భక్తులు కోరుతున్నారు.

ఉప కాల్వలో స్నానాలు

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 180 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెంకటాపురం ఎస్సై చల్లా రాజు తెలిపారు. రామప్పలో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశాల్లోనే వాహనదారులు వాహనాలు నిలిపి పోలీసులకు సహకరించాలని కోరారు. కాగా రామప్ప సరస్సుకు చెందిన ఉపకాల్వల్లో స్నానాలు ఆచరించి రామప్ప ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

రామప్పను చూసొద్దాం..1
1/3

రామప్పను చూసొద్దాం..

రామప్పను చూసొద్దాం..2
2/3

రామప్పను చూసొద్దాం..

రామప్పను చూసొద్దాం..3
3/3

రామప్పను చూసొద్దాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement