అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నెల 8న ఈ జంట అఫీషియల్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన జంటకు పలువురు సినీతారలు, అభిమానులు అభినందనలు తెలిపారు.
తాజాగా ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను శోభిత ధూళిపాళ్ల షేర్ చేసింది. చైతూతో కలిసి ఊయలలో కూర్చుని దిగిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఫోటోలతో పాటు ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
సంతోషంగా ఉందన్నా నాగార్జున
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం విషయంలో తాము సంతోషంగా ఉన్నామని హీరో నాగార్జున తెలిపారు. విడాకుల అనంతరం చైతన్య చాలా బాధపడ్డారని వివరించారు. తన బాధను ఎవరితోనూ పంచుకోలేదని వెల్లడించారు. చైతూ సంతోషంగా ఉండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని నాగార్జున వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment