‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. షూటింగ్‌ పూర్తి, కానీ.. | RRR Movie Update: Couple Of Pickup Up Shots Remaind | Sakshi
Sakshi News home page

RRR Movie : క్రేజీ అప్‌డేట్‌.. షూటింగ్‌ పూర్తి, కానీ..

Aug 26 2021 4:27 PM | Updated on Aug 26 2021 4:57 PM

RRR Movie Update: Couple Of Pickup Up Shots Remaind - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(రౌద్రం,రణం, రుధిరం). ఇటీవల ఉక్రెయిన్‌లో చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీం హైదరాబాద్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ అక్టోబర్‌ 13న విడుదలకు సిద్దమైందని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో విడుదల తేదీ వాయిదా పడినట్లు వార్తలు వెలువడ్డాయి. వచ్చే ఏడాది ఉగాదికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ విడుదల చేయనున్నట్లు సమాచారం. దీంతో అక్టోబర్‌లోనే సినిమాను చూడోచ్చని సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే విడుదల తేదిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

చదవండి: వచ్చే ఏడాది ఉగాదికి ఆర్ఆర్ఆర్?


ఇదిలా ఉంటే.. గురువారం ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ని ఇచ్చింది చిత్రబృందం. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ మొత్తం పూర్తి అయ్యిందని, అయితే కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌ ఇవ్వనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్ దోస్తీకి అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: సినిమాల వర్షం కురిపించడానికి సిద్దమైన అగ్రదర్శకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement