
'కాంతార' మూవీతో సంచలనం సృష్టించిన కన్నడ హీరో రిషబ్ శెట్టి మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం 'కాంతార' ప్రీక్వెల్ చేస్తున్న ఇతడు.. తర్వాత ప్రశాంత్ వర్మ తీసే 'జై హనుమాన్' చేస్తాడు. దీని తర్వాత ఓ హిందీ మూవీ లైన్‌లో ఉంది. ఇప్పుడు వీటితో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తీసే సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? పవన్ పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం)
18వ శతాబ్దంలో భారత్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఓ తిరుగుబాటుదారుడి కథతో ఈ సినిమాని తీయబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడలోనూ దీన్ని ఒకేసారి తీస్తారు. అనంతరం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తారు.
(ఇదీ చదవండి: 'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు)
