డిస్నీప్లస్ హాట్ స్టార్ లో "వారియర్" స్ట్రీమింగ్‌.. | Sakshi
Sakshi News home page

Warrior Movie: డిస్నీప్లస్ హాట్ స్టార్ లో "వారియర్" స్ట్రీమింగ్‌..

Published Fri, Aug 12 2022 11:20 AM

Ram Pothineni Warrior Movie Is Taking Disney Plus Hotstar By Strom - Sakshi

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఉర్రూతలూగిస్తోంది. దాని పేరు "ది వారియర్". ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెండు క్యారక్టర్లతో సంచలనం సృష్టించారు. హీరో రామ్ కి జోడీగా యంగ్, టాలెంటెడ్, మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తున్నారు. పందెం కోడి, ఆవారా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త రకం సినిమాలు అందించిన దర్శకుడు లింగుస్వామి ఈ విభిన్నమైన కథకి కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలిపి ఒక పండగ భోజనంలా వడ్డించారు.

డాక్టర్ నుంచి పోలీస్ గా మారడం అనే ఆలోచన తెలుగు ప్రేక్షకులకు కొత్త. దర్శకుడు లింగుసామి ఆ ప్రయత్నాన్ని కమర్షియల్ సక్సెస్ చేశారు. ఇక డీఎస్పీ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎక్కడవిన్నా ఈ పాటలు  మారుమోగిపోతున్నాయి. ప్రేక్షకులకు నచ్చే మరెన్నో విషయాలు వున్న ఈ మంచి ఫామిలీ ఎంటర్ టైనర్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మిస్ కాకుండా చూడండి. స్ట్రీమింగ్ ఇప్పటికే మొదలైంది.

"వారియర్" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Advertisement
 
Advertisement
 
Advertisement