గోపిచంద్‌ కోసం విజిల్‌ వేసిన ప్రభాస్‌.. హ్యాపీగా ఉందని కామెంట్‌ | Prabhas Comments On Social Media On Gopichand Seetimaarr Success | Sakshi
Sakshi News home page

Seetimaarr: గోపిచంద్‌ కోసం విజిల్‌ వేసిన ప్రభాస్‌.. హ్యాపీగా ఉందని కామెంట్‌

Sep 12 2021 11:56 AM | Updated on Sep 20 2021 11:47 AM

Prabhas Comments On Social Media On Gopichand Seetimaarr Success - Sakshi

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ప్రభాస్‌, గోపిచంద్‌ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి గతంలో వర్షం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెరపై వీరు కలిసి కనిపించకపోయినా.. ఆఫ్ స్క్రీన్‌లో వీరి బంధం కొనసాగుతోంది. ఇటీవల గోపీచంద్ 'సీటీమార్' వినాయక చవితి సందర్భంగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా చూసిన ప్రభాస్‌ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ప్రభాస్‌ సీటీమార్ స‌క్సెస్ గురించి అభినందిస్తూ ఓ విజిల్ బొమ్మ‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దానికి క్యాప్షన్‌గా .."నా స్నేహితుడు గోపీచంద్ సీటీమార్ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. చాలా హ్యాపీగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ సీటీమార్. ఇలాగే విజయవంతంగా రన్ అవ్వాలని కోరుకుంటూ చిత్రబృందానికి అభినందనలు" అని అందులో తెలిపారు. కాగా చాలా కాలం తర్వాత గోపీచంద్  సంపత్ నందికి మంచి కమర్షియల్ హిట్ దక్కింది. 

‘సీటీమార్‌’ సినిమా ముఖ్యంగా మాస్‌ సెంటర్లలో దూసుకుపోతోంది. తొలిరోజునే దాదాపు నాలుగు కోట్ల‌కు వరకు వ‌సూళ్ల‌ను సాధించింది. సెకండ్ కోవిడ్ తరువాత దేశవ్యాప్తంగా విడుద‌లైన సినిమాల్లో అత్యధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా సీటీమార్ రికార్డ్‌ను క్రియేట్ కూడా చేసింది.  

చదవండి: Sai Dharam Tej-Road Accident: సాయి రాష్‌గా వెళ్లే వ్యక్తి కాదు: నటుడు శ్రీకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement