నిశుంబిత స్కూల్ ఆఫ్ డ్రామా నాటోత్సవ్ - 8 ప్రారంభం ఎప్పుడంటే..?

Nishumbita School Of Drama Announced MAHOTSAV Celebrated - Sakshi

నిశుంబిత అంటే పూర్తిగా సాంఘిక నాటకాలకు కేరాఫ్ అనే చెప్పాలి. వీధినాటకాలు నిశుంబిత ప్రత్యేకత. సామాజికంగా ఆలోచింపజేసే కధలను వీరు నాటకాల్లో చూపిస్తారు. నిశుంబితలో కమర్షియాల్టీకి ఎలాంటి ప్రాధాన్యం లేదు. నిశుంబితలో యాక్టింగ్, డైరెక్షన్ లాంటివి నేర్చుకున్న వందల మంది టీవి, సినిమా లాంటి మాధ్యమాల్లో రాణించారు. ఇప్పుడు నిశుంబిత స్కూల్ ఆఫ్ డ్రామా నాటోత్సవ్ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఏనిమిదో నాటోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2024 మార్చి 23 నుంచి 27 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

నిశుంబిత 30 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన థియేటర్ వర్క్‌షాప్ ద్వారా నూతనంగా ఎంపికైన వారితో కలిసి ప్రదర్శన ఇస్తున్న నిశుంబిత బృందంలోని రంగస్థల అనుభవజ్ఞులు, నాటక పాఠశాల వ్యవస్థాపకుడు రామ్మోహన్ హోలగుండి నిశుంబిత ఫౌండర్, మెంబర్  ఆలోచనల ద్వారా నాటోత్సవ్ రూపొందించబడింది. నిశుంబిత నుంచి ఎన్నో సాంఘిక నాటకాలు వచ్చాయి. ముఖ్యంగా వీధినాటకాలు నిశుంబిత ప్రత్యేకత అని చెప్పవచ్చు. సామాజికంగా ఆలోచింపజేసే కధలను వీరు నాటకాల్లో చూపిస్తారు.

అవార్డు-గెలుచుకున్న కన్నడ నాటక రచయిత గిరీష్ కర్నాడ్ తన మాగ్నమ్ ఓపస్ నాగమండలకి ప్రసిద్ధి చెందాడు, ఇది కర్ణాటక గ్రామీణ  జానపద కథల ఆధారంగా రూపొందించిన గొప్ప నాటకం. దాని తెలుగు అనుసరణ ప్రదర్శించబడుతుంది. నిశుంబిత ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్  తెలుగు నాటకం 'కుక్క' ప్రదర్శన ఉంది. ఇది భూస్వాముల కులీన పాలనను   వర్ణిస్తుంది.

'మిట్టి కీ ఖిలౌనీ పిల్లల విద్య గురించి చెబితే..  రావణ రావణము  భారతీయ ఇతిహాసాలలో విలన్‌లా ఉన్న రావణుడి గురించి వర్ణిస్తుంది. వుయ్‌ టూ.. అనేది మహిళా సాధికారత నినాదాల గురించి ఉన్న నాటకం. ఒక పురుషుని మౌనంపై ఆలోచింపజేసే ఏకపాత్రాభినయంతో ఉన్న నాటకం. అవి నాటోత్సవ్ వేదికగా ప్రదర్శితం అవుతాయి. మరిన్ని వివరాల కోసం శ్రీమతి దేవికా దాస్, టీమ్ నిశుంబిత, 9971268729 నుంచి సంప్రదించండి.

Election 2024

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top