థ్రిల్‌ అవుతారు | Nayan Sarika And Tanvi Ram About Ka Movie | Sakshi
Sakshi News home page

థ్రిల్‌ అవుతారు

Oct 28 2024 3:21 AM | Updated on Oct 28 2024 3:21 AM

Nayan Sarika And Tanvi Ram About Ka Movie

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన పీరియాడికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘క’. ఈ చిత్రంలో నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సుజీత్‌–సందీప్‌ ద్వయం ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని తెరకెకక్కించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. తెలుగులో వంశీ నందిపాటి రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌ సందర్భంగా నయన్‌ సారిక మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను పల్లెటూరి అమ్మాయి సత్యభామగా నటించాను.

వాసుదేవ్‌గా కిరణ్‌ అబ్బవరం కనిపిస్తారు. కథలో థ్రిల్‌కి గురి చేసే మలుపులు ఉంటాయి. క్లైమాక్స్‌ ఆడియన్స్‌కు గుర్తుండిపోతుంది. నటీమణులు సావిత్రి, శ్రీదేవిగార్లు చేసిన పాత్రలను రిఫరెన్స్‌లుగా తీసుకుని నేను సత్యభామ పాత్ర చేశాను’’ అన్నారు. తన్వీ రామ్‌ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో స్కూల్‌ టీచర్‌ రాధ పాత్రలో నటించాను.

అభినయ వాసుదేవ్, సత్యభామ ఒక టైమ్‌ ఫ్రేమ్‌లో కనిపిస్తే, మరో పీరియడ్‌ టైమ్‌లో నా రోల్‌ ఉంటుంది. వాసుదేవ్, సత్యభామల పాత్రలకు నా రోల్‌ ఎలా కనెక్ట్‌ అవుతుందనేది థియేటర్స్‌లో చూడండి. ఈ సినిమా చూసి ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారని నమ్మతున్నాం’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement