ప్యారడైజ్‌లోకి ఎంట్రీ  | Nani New Movie The Paradise look release | Sakshi
Sakshi News home page

ప్యారడైజ్‌లోకి ఎంట్రీ 

Jun 29 2025 5:50 AM | Updated on Jun 29 2025 5:50 AM

Nani New Movie The Paradise look release

‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల, నిర్మాత సుధాకర్‌ చెరుకూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్‌’. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో నాని పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ‘ధగడ్‌  ఆగయా!’ అంటూ నాని సరికొత్త లుక్‌ రిలీజ్‌ చేశారు. ‘‘ది ప్యారడైజ్‌’ కోసం గ్రాండ్‌గా సెట్స్‌ వేశాం.

 40 రోజుల హైదరాబాద్‌ షెడ్యూల్‌లో భాగంగా ఓ వారం పాటు కీలకమైన బాల్యం సన్నివేశాలు చిత్రీకరించాం. శనివారం నాని ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ‘దసరా’ పాన్‌ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. ‘ది ప్యారడైజ్‌’ ప్రపంచ స్థాయికి వెళ్లబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లో 2026 మార్చి 26న రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement